కంపించిన భూమి… భ‌యంతో జ‌నం ప‌రుగులు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధ‌వారం తెల్ల‌వారుజామున‌, అలాగే మ‌రికొన్ని చోట్ల ఉద‌యం 7 గంట‌ల‌కు భూమి కంపించింది. దీంతో జ‌నం భ‌యంతో ఇళ్ల‌లో నుంచి బ‌య‌టికి ప‌రుగులు తీశారు. తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, ఉమ్మ‌డి ఖ‌మ్మం,…

రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధ‌వారం తెల్ల‌వారుజామున‌, అలాగే మ‌రికొన్ని చోట్ల ఉద‌యం 7 గంట‌ల‌కు భూమి కంపించింది. దీంతో జ‌నం భ‌యంతో ఇళ్ల‌లో నుంచి బ‌య‌టికి ప‌రుగులు తీశారు. తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, ఉమ్మ‌డి ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ జిల్లాల్లోనూ, అలాగే ఏపీలో ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూమి ప‌ది సెకెన్ల పాటు క‌దిలింది. దీంతో ఇళ్ల‌లోని వ‌స్తువులు కింద‌ప‌డ్డాయి.

భూకంపం వ‌చ్చింద‌ని ప్ర‌జ‌లు గ్ర‌హించి, భ‌యంతో బ‌య‌టికి ప‌రుగులు తీశారు. హైద‌రాబాద్‌లో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, బోర‌బండ‌, రాజేంద్ర‌న‌గ‌ర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. అలాగే ఖ‌మ్మం, భ‌ద్రాద్రికొత్త‌గూడెం, నేల‌కొండ‌ప‌ల్లి, వ‌రంగ‌ల్‌, ఆ జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో భూమి 10 నుంచి 15 సెకెండ్ల పాటు కంపించింది.

విజ‌య‌వాడ‌, తిరువూరు, మంగ‌ళ‌గిరి, నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట‌, తుళ్లూరు త‌దిత‌ర ప్రాంతాల్లో భూమి కొన్ని క్ష‌ణాల పాటు కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యంతో ప‌రుగులు తీశారు. రిక్ట‌ర్ స్కేల్‌పై 5.3గా ప్ర‌కంప‌న‌ల తీవ్ర‌త న‌మోదైంది. భూప్ర‌కంప‌న‌ల తీవ్ర‌త ఎక్కువ‌గా లేన‌ప్ప‌టికీ, భ‌విష్య‌త్‌లో ఏమ‌వుతుందో అనే ఆందోళ‌న మాత్రం సృష్టించిందని చెప్పొచ్చు.

25 Replies to “కంపించిన భూమి… భ‌యంతో జ‌నం ప‌రుగులు!”

  1. లె..1అన్న ముందే ఊహించే జ్ఞాని అందుకే బెంగు-లూరు లో

    ఉన్నాడని ఒక లైన్ రాసి నీ స్వామి భక్తిని కలిపెయ్యాల్సింది పనిలో పనిగా..

  2. కాకినాడ పోర్టు, సెజ్‌లను మా నుంచి లాక్కున్నారు – సీఐడీకి వాటి యజమాని కేవీరావు ఫిర్యాదు

    వైవీ తనయుడు విక్రాంత్‌తో మాట్లాడాలని సాయిరెడ్డి ఫోన్‌.. వాటాలు వదులుకోకుంటే జైలుకే అన్న విక్రాంత్‌

    పోర్టులో 2500 కోట్ల విలువైన మా వాటాకు 494 కోట్లు, సెజ్‌లో రూ.1104 కోట్ల షేర్లకు గాను రూ.12 కోట్లే

    అన్యాయం గురించి చెబుతున్నా వినని నాటి సీఎం

  3. హైదరాబాద్ సిస్మిక్ జోన్లో ఉంది అంటే ఎవడో హాఫ్ నాలెడ్జ్ బడ్కో నువు ఊహించుకొంటున్నావు అని రిప్లై పెట్టాడు, ఈరోజు ఏమైంది? అమరావతి పైన ఏడిచే యెదవలందరికి హైదరాబాద్ గొప్పగా కనిపిస్తుంది

Comments are closed.