కూటమి పెద్దలు క్షమాపణ చెబుతారా?

విశాఖ వచ్చిన షిప్‌ కంటెయినర్‌పైన వైసీపీ మీద లేని పోని నిందలు వేసి పెద్ద ఎత్తున ఎన్నికల ముందు తరువాత ప్రచారం చేస్తూ వచ్చిన కూటమి పెద్దలు సీబీఐ దర్యాప్తు తరువాత ఏమని బదులిస్తారు…

విశాఖ వచ్చిన షిప్‌ కంటెయినర్‌పైన వైసీపీ మీద లేని పోని నిందలు వేసి పెద్ద ఎత్తున ఎన్నికల ముందు తరువాత ప్రచారం చేస్తూ వచ్చిన కూటమి పెద్దలు సీబీఐ దర్యాప్తు తరువాత ఏమని బదులిస్తారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు.

కేవలం అధికారం కోసం ఎంతకైనా అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారని గుడివాడ ఫైర్ అయ్యారు. ఆ విధంగానే విశాఖ షిప్‌ కంటెయినర్‌పై విష ప్రచారం చేశారని అన్నారు

అయితే అందులో ఎలాంటి డ్రగ్స్‌ లేవని సీబీఐ తేల్చి చెప్పిందని ఆయన అంటూ దీనికి టీడీపీ కూటమి పెద్దలు ఇప్పటికైనా క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు.

వైసీపీ మీదనే కాదు విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. ఆనాడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేలా విష ప్రచారం చేశారని అన్నారు. దానికి గానూ వైసీపీకి, విశాఖ ప్రజలకు వెంటనే టీడీపీ కూటమి పెద్దలు క్షమాపణలు చెప్పాలని గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు.

ఆనాడు ఏ ఆధారం లేకుండా డ్రగ్స్‌ కంటెయినర్‌ షిప్‌ అంటూ ఏది పడితే అది మాట్లడారని, పాతిక కిలోల డ్రగ్స్‌తో విశాఖకు షిప్‌ వచ్చిందని భారీ ఆరోపణలు చేశారని అన్నారు. అంతే కాదు లేని డ్రగ్స్‌ ఉన్నాయంటూ ఉత్త పుణ్యానికి వైసీఎపీ ప్రభుత్వానికి ముడి పెట్టారని గుడివాడ అన్నారు.

ఇక అదే పనిగా ఎల్లో మీడియాలో కథనాలు వండి వార్చారని ఆయన నిప్పులు చెరిగారు. ఆ విధంగా గత ఎన్నికల్లో లబ్ధి పొందేలా చంద్రబాబు కుట్ర చేశారని ఆయన అన్నారు.

ఇక సీబీఐ దర్యాప్తు తీరుపై మాకు పలు అనుమానాలు ఉన్నయని గుడివాడ అన్నారు. కేవలం డ్రగ్స్‌పై విచారణకు ఇంత సమయం ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఏకంగా ఎనిమిది నెలల పాటు ఏ దర్యాప్తు చేశారని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చి 21న, ఒక షిప్‌ కంటెయినర్‌ 25 వేల కేజీల డ్రగ్స్‌తో విశాఖ పోర్టుకి వచ్చింది. అయితే అది వైసీపీ నేతలే తెప్పించారని గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో పాటు, టీడీపీ నాయకులు అదే పనిగా తప్పుడు ప్రచారం చేశారని గుడివాడ నిప్పులు చెరిగారు. తీరా చూస్తే ఆ కంటెయినర్‌లో ఎలాంటి డ్రగ్స్‌ లేవని, అది కేవలం డ్రై ఈస్ట్‌ అని సీబీఐ ప్రకటించిందని అన్నారు.

ఇదంతా చూస్తుంటే, నాడు ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం జరిగిందని అన్నారు. ఇలా డ్రగ్స్‌ పేరుతో విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీయాలని కుట్ర చేసినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

22 Replies to “కూటమి పెద్దలు క్షమాపణ చెబుతారా?”

    1. ”జాతి రత్నాలు” గురించి తెలిసి కూడా అడగటం హాస్యాస్పదం.

      1. 32 మంది డీఎస్పీలు ఒక సామాజిక వర్గానికి అన్నప్పుడు, పింక్ డైమండ్ కి క్షమాపణ చెప్పే ధైర్యం వై-ఛీ-pee కి ఉంటే అప్పుడు చూద్దాం..

  1. Pavala gaadu andukenaa ee madhya kakinada port lo andaru maa valle undali annadu…endukante ade scene repeat avutundi ani ..

    I think cbn gaadiki gaani , ok gaadiki gaani antha scene ledu. There must support of central otherwise dry east ni pattukuni ala anaru..

  2. 32 మంది డీఎస్పీలు ఒక సామాజిక వర్గానికి అన్నప్పుడు, పింక్ డైమండ్ కి క్షమాపణ చెప్పే ధైర్యం వై-ఛీ-pee కి ఉంటే అప్పుడు చూద్దాం..

  3. 32-మంది-డీఎస్పీలు-ఒక-సామాజిక-వర్గానికి-అన్నప్పుడు, పింక్డై-మండ్ కి-క్షమాపణ-చెప్పే-ధైర్యం-వై-ఛీ-పీ- కి-ఉంటే అప్పుడు-చూద్దాం..

  4. నిన్ను కూడా జగ్గల్ ఒక వ్యూహం ప్రకారం గాజువాక లో M కు..డిపిచ్చాడు..స్టేట్ లో అత్యధిక మెజారిటీ 93000…

Comments are closed.