జనసేన నేత మీద బాబుకు ఫిర్యాదు

లేటెస్ట్ గా విశాఖలో పర్యటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూటమికి చెందిన నేత మీదనే ఫిర్యాదు అందింది.

లేటెస్ట్ గా విశాఖలో పర్యటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూటమికి చెందిన నేత మీదనే ఫిర్యాదు అందింది. మిత్రపక్షంగా ఉన్న జనసేన కార్పోరేటర్ ఒకరు చేసిన నిర్వాకానికి తామంతా రోడ్డున పడ్డామంటూ చంద్రబాబుకు తోపుడు బండ్ల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

తాము కార్పోరేటర్ గా ఆయనను గెలిపిస్తే ఆయన తమ పొట్ట కొట్టారని వారు ఆరోపించారు. హైకోర్టులో కేసు వేసి తోపుడు బండ్లను తొలగించడంతో తామంతా ఉపాధి లేక రోడ్డు మీద ఉన్నామని వారు బాబుకు నివేదించుకున్నారు.

తమను ఆదుకోవాలని తిరిగి తమ పాత ఉపాధి దక్కేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇదిలా ఉంటే ఈ జనసేన నేత ఓట్ల కోసం మళ్లీ తమ వద్దకే రావాలని తోపుడు బళ్ల సంఘం ప్రతినిధులు అంటున్నారు. ఓట్లేసి గెలిపించినందుకు తమ ఉపాధినే దెబ్బ తీస్తే ఎలా అని వారు వాపోతున్నారు.

ఆయనకు అందరి మీద కోర్టులో కేసులు వేయడం అలవాటని ఇపుడు తమ మీద పడి పేదల బతుకులు చిద్రం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూటమికి చెందిన నాయకుడు కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలని అంటున్నారు.

One Reply to “జనసేన నేత మీద బాబుకు ఫిర్యాదు”

Comments are closed.