సంక్రాంతి బరిలోకి ‘రాబిన్ హుడ్’?

నితిన్-శ్రీలీల కాంబినేషన్ రాబిన్ హుడ్ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ మేరకు దాదాపు నిర్ణయం ఫిక్స్ అయింది.

నితిన్-శ్రీలీల కాంబినేషన్ రాబిన్ హుడ్ సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ మేరకు దాదాపు నిర్ణయం ఫిక్స్ అయింది. క్రిస్మస్‌కు రావాల్సి ఉంది ఈ సినిమా. కానీ వర్క్ పూర్తి కాలేదు. పుష్ప రన్ ఇంకా ఉంది. అందువల్ల నిర్మాతలు క్రిస్మస్ అన్నది సెట్ కాదని డిసైడ్ అయ్యారు. కానీ హీరో నితిన్ ఎలాగైనా క్రిస్మస్‌కు రావాలని పట్టుపట్టారు. అయితే వర్క్ పూర్తి కాలేదు. సినిమాకు పబ్లిసిటీ కూడా ఇంకా జరగలేదు. జస్ట్ పది రోజులే సమయం ఉంది. అందుకే ఇక వాయిదా తప్పలేదు.

కొత్త డేట్ మీద మళ్లీ డిస్కషన్లు మొదలయ్యాయి. ఫిబ్రవరిలో దిల్ రాజు నిర్మించిన నితిన్ సినిమా తమ్ముడు విడుదల ఉంది. అందువల్ల ఇంకా వెనక్కు వెళ్లిపోవాల్సి ఉంటుంది. సంక్రాంతికి ఇప్పటి మూడు సినిమాలే డిసైడ్ అయ్యాయి. నాలుగో సినిమాకు అవకాశం ఉంది. పైగా సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాల్లో రెండు దిల్ రాజు నిర్మాణం. మూడు సినిమాలు నైజాంలో దిల్ రాజు పంపిణీ. మైత్రీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

అందువల్ల సంక్రాంతికి రాబిన్ హుడ్‌ను వదిలే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది.

4 Replies to “సంక్రాంతి బరిలోకి ‘రాబిన్ హుడ్’?”

  1. అసలు ఈ సినిమా ఒకటి ఉంది అని, ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎవరూ ఎదురు చూడటం లెదు,!

    నువ్వు మాత్రం మా రెడ్ది సినిమాకి ఆ మాత్రం డప్పు వెయాలి కదా అన్నట్టు చెస్తున్నవ్! నీ అతి తొ వెగటు మరి పుట్టించకు GA!

Comments are closed.