బన్నీ అరెస్ట్.. ముందు వెనుక..!

వెంటనే బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ వస్తే ఏ గొడవ లేదు. అలా కాకుండా రిమాండ్ అంటే మాత్రం కాస్త గడబిడగానే వుంటుంది.

సంధ్య థియేటర్ దగ్గర పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన నేపథ్యంలో హీరో బన్నీని పోలీసులు అరెస్ట్ చేసారన్న వార్తలు గుప్పు మన్నాయి. ఇది నిజంగా అన్ ఎక్స్ పెక్టెడ్… సరే, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. స్టేషన్ బెయిల్ ఇస్తారా. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారా? ఇవన్నీ మరి కొద్ది సేపట్లో తెలుస్తుంది. కానీ అసలు ఏమిటి దీని ముందు వెనుక?

పుష్ప 2 సినిమాకు సంధ్య థియేటర్ లో ప్రీమియర్ వేసారు. అదే రోజు చాలా థియేటర్లలో ప్రీమియర్లు వేసారు. అటు సింగిల్ స్క్రీన్ లు, ఇటు మల్టీ ప్లెక్స్ లు. ఎక్కడా ఏమీ తొక్కిసలాట జరగలేదు. కానీ సంధ్య థియేటర్ దగ్గర మాత్రమే జరిగింది. దానికి కారణం హీరో బన్నీ అక్కడకు రావడం. అది కూడా ఓపెన్ టాప్ జీప్ లో రావడం, బన్నీ వస్తున్నారని జనాలకు ముందే తెలియడం.

ఇక్కడ రెండు పాయింట్లు. బన్నీ అక్కడకు వస్తున్నారని ముందే తెలిసింది కనుక, థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చిందా లేదా?

అలా సమాచారం ఇచ్చి బందోబస్త్ కోరారా? లేదా? అన్నది మరో పాయింట్.

బన్నీ రాకకు అనుమతి ఇచ్చి, బందోబస్త్ చేసి వుంటే ఇక ఎవరి తప్పు లేదు. అటు థియేటరు తప్పిదం లేదు. ఇటు బన్నీ తప్పిదం లేదు. కానీ అలా ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా, కోరకుండా వుండి వుంటే ఇటు థియేటర్ ది, అటు బన్నీ ది తప్పు అవుతుంది.

ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది, తమకేమీ సంబంధం లేదని చెప్పింది. ఆ మేరకు తన వాదన వినిపిస్తోంది.

ఇప్పుడు అల్లు అర్జున్ కోర్టులో తన వాదన చెప్పాల్సి వుంది. పోలీసులు అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారని తెలుస్తోంది. 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు.. 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుల్ కేసు..నమోదు అయిందని బోగట్టా.

అంటే మరి వీటికి స్టేషన్ బెయిల్ ఇస్తారో ఇవ్వరో చూడాలి. స్టేషన్ బెయిల్ ఇస్తే ఏ సమస్య లేదు. అలాగే ఈ రోజు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిస్తే, వెంటనే బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ వస్తే ఏ గొడవ లేదు. అలా కాకుండా రిమాండ్ అంటే మాత్రం కాస్త గడబిడగానే వుంటుంది.

పైగా రేపు శని, ఆది వారాలు. మండే వరకు ఇబ్బంది అవుతుంది. చూడాలి ఏం జరుగుతుందో?

30 Replies to “బన్నీ అరెస్ట్.. ముందు వెనుక..!”

      1. పావలా కుక్క లాగా ప్యాకేజీ తీసుకోలేదు కదా, కష్టపడి సినిమా చేసి సంపాదించాడు
      2. Bro.

        I don’t care if AA is arrested by the TG police.

        As AA told the reporters, he used to see movies on release day.

        TG cops ought to take some more as the outcome of the AA visit, as well as should the theater owner too.

    1. నిరంజన్ రెడ్డి ఏమి చేయగలరు , అదే మన కాకర్ల సుబ్బా రావు చౌదరి బ్రతికుంటే ఎదో మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చి సేవ్ చేసేవారు..

    2. నిరంజన్ రెడ్డి ఏమి చేయగలరు , అదే మన కాకర్ల సుబ్బా రావు చౌదరి బ్రతికుంటే ఎదో మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చి సేవ్ చేసేవారు..

  1. పది రూపాయలు విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్ను 11 రూపాయలకు కూడా కొనను అని అన్నవాడు ఇప్పుడు ఒకవైపున రేవతి గారి చావుతో తనకు సంబంధం లేదని కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ, మరోవైపు ఆమె కుటుంబానికి పాతిక లక్షలు ఇస్తానని, వైద్య ఖర్చులు కూడా భరిస్తానని ఎలా చెబుతున్నాడు? ఆమె మరణం వెనుక తన తప్పు ఉందని తనకు బాగా తెలుసు. Point to be noted.

  2. ఏమీ జరగదు. కేసు నుండీ పూర్తిగా విముక్తి పొందుతాడు. చూస్తూ ఉండండి.

  3. మన ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు గా ఇప్పుడు లైఫ్ లాంగ్ గుర్తు ఉంటది

  4. అ ల్లు గా డు అ రె స్టు ఐ తే , దం డు పా ళ్యం వై సీ పీ. పా ర్టీ. కు క్క లు. ఎం దు కు

    ఏ డు స్తు న్నా యి. …. పై గా. అ త్తు లు. స్టా ర్ గా డి. త రు ఫు న. వా దిం చే ది

    వై సి పి పా ర్టీ ఊ డి గం. లా య ర్

  5. ఈ సోదట ఏంటి…గత పుష్కరాల్లో కానీ,ఈ మధ్య ఎన్నికల కామెపైన్ లలో కానీ జరిగిన తొక్కిసలాటలో పోయి ఆ వాళ్ళ కోసం ఎవ్వరైనా చర్య తీసుకున్నారా..

      1. సిబిఎన్ అలాంటి మెంటాలిటీ ఐతే ఇప్పటికీ ఎంతో మంది అరెస్టు అయ్యుండేవాళ్ళు. అన్నీ చూసి చూడనట్టుగా వదిలేస్తాడనేగ టిడిపి వాళ్ళు కూడా విసుక్కుంటారు.

Comments are closed.