శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ చిన్న సినిమా క్రిస్మస్ కు విడుదల అవుతోంది. దీనికి సంబంధించి చిన్న వైరల్ న్యూస్ ఏమిటంటే సినిమాలో హీరోగా నటించిన వెన్నెల కిషోర్ ప్రచారానికి సహకరించడం లేదు అని. ఈ రోజు జరిగిన మీడియా మీట్ లో ఇదే విషయమై అడిగితే, హోల్ సేల్ బయ్యర్ వంశీ నందిపాటి, వెన్నెల కిషోర్ హీరో కాదు, కథే హీరో, దాన్ని నమ్ముకునే ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇది కాస్త వైరల్ అయింది.
ఇప్పుడు ఈ విషయమై వెన్నెల కిషోర్ క్లారిటీ ఇచ్చారు. ‘అమెరికాలో షూటింగ్ పని మీద వున్న ఆయన ‘గ్రేట్ ఆంధ్ర’తో ఫోన్ లో మాట్లాడారు. ఈ కింది పాయింట్లను వివరంగా చెప్పారు.
నాకు ఈ రోజుకీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కథ తెలియదు. ఎందుకంటే నాకు చెప్పలేదు. కారణం ఏమిటంటే ఈ సినిమాలో నాది జస్ట్ ఓ మధ్యలో వచ్చే చిన్న పాత్ర మాత్రమే అని దర్శకుడు, నిర్మాత చెప్పారు. జస్ట్ ఏడుగురిని ఇంటరాగేట్ చేయాలి. ఏడు వర్కింగ్ డేస్ షూట్ చేస్తే చాలు అన్నారు. టైటిల్ కూడా సప్త స్వరాలు..లేదా ఏదో సమ్ థింగ్ అలాంటిది చెప్పారు. సరే షూట్ చేసేసాను. కానీ తరువాత మళ్లీ ఒక్క రోజు కావాలి సర్ అని అడిగారు. దేనికి అంటే ఎమోషన్ యాడ్ చేయాలి క్యారెక్టర్ కు అన్నారు. అదేంటీ ఎమోషన్ అంటే కాదు, రిక్వెస్ట్ అన్నారు. సరే అని చేసారు. తరువాత కొన్నాళ్లకు వచ్చి మరో వన్ డే అడిగారు. ఇది దేనికి అంటే సాంగ్ లో మీర కూడా కనిపిస్తే బాగుంటుంది అన్నారు.
ఈ మధ్యలో గెటప్ శ్రీను ఫోన్ చేసి అన్నా, నువ్వు హీరో అంట కదా అని అడిగారు. వెంటనే డైరక్టర్ ను అడిగితే అబ్బే కాదన్నారు. తరువాత అనీష్ కురివెళ్ల కూడా అదే చెప్పారు. పోస్టర్లు అలాగే వేస్తున్నారు అని. అప్పుడు కూడా అడిగితే, అబ్బే అస్సలు కాదని, వేరే హీరో వున్నాడని అన్నారు. ఇలా చెబుతూనే మొత్తానికి పది రోజులు తీసుకున్నారు నా నుంచి.
ఈ మధ్య టోటల్ స్క్రీన్ ప్లే మార్పించి, మళ్లీ కొత్తగా డబ్బింగ్ చెప్పించారు. సరే అని మళ్లీ డబ్బింగ్ చెప్పాను. ఇదీ జరిగింది. ఇప్పుడు సినిమాను నేను హీరో అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. నేనేదో పబ్లిసిటీ రావడం లేదనే కలర్ ఇస్తున్నారు. నిజానికి నేను యుఎస్ కు వెళ్తున్నా అని ముందే యూనిట్ కు తెలుసు. సారంగపాణి జాతకం సినిమా పబ్లిసిటీకి నాలుగు రోజులు ఇస్తా అన్నాను. ఇచ్చాను. పబ్లిసిటీ చేసాను.
ఇదంతా మీకు తెలియాలి అని చెప్పాను తప్ప, మరోటి కాదు.. అంటూ ముగించారు వెన్నెల కిషోర్.
9019471199
Vc