జ‌నం అమాయ‌కుల‌ని అనుకుంటున్నారా బాబు!

ఆర్థిక‌ ఇబ్బందుల‌ను చూస్తే బాధేస్తోంది. ఆరు నెల‌లుగా రాత్రింబ‌వ‌ళ్లూ ఆలోచిస్తున్నా, ఐదేళ్ల విధ్వంసానికి ప‌రిష్కారం దొర‌క‌ట్లేదు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తానెంతో తెలివిగా మాట్లాడుతున్నాన‌ని అనుకుంటుంటారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అధ్వానంగా వుంద‌ని ప‌దేప‌దే చెబితే, అయ్యో పాపం చంద్ర‌బాబు అని జ‌నం అనుకుంటార‌ని ఆయ‌న న‌మ్ముతున్న‌ట్టున్నారు. తాజాగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై చంద్ర‌బాబు మ‌రోసారి బీద ఏడ్పు. ఆయ‌న ఏమ‌న్నారంటే…

“ఆర్థిక‌ ఇబ్బందుల‌ను చూస్తే బాధేస్తోంది. ఆరు నెల‌లుగా రాత్రింబ‌వ‌ళ్లూ ఆలోచిస్తున్నా, ఐదేళ్ల విధ్వంసానికి ప‌రిష్కారం దొర‌క‌ట్లేదు” అని వాపోయారు. ఇలాంటి బీద‌రిక‌పు మాట‌లు చంద్ర‌బాబు నుంచి ప‌దేప‌దే ఎందుకు వ‌స్తున్నాయో అర్థం చేసుకోలేనంత అమాయ‌క స్థితిలో జ‌నం లేరు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు అలివికాని హామీలిచ్చారు. అప్ప‌టి వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం భారీ మొత్తంలో ఇచ్చిన సంక్షేమాన్ని కాద‌ని, ఇంకా ఎక్కువ‌గా చంద్ర‌బాబు ఇస్తార‌ని ఆశించి అప‌రిమిత‌మైన అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు.

చంద్ర‌బాబు ఇచ్చిన ప్ర‌ధాన హామీల అమ‌లుపై ఇంకా కూట‌మి స‌ర్కార్ దృష్టి సారించ‌లేదు. ప్ర‌భుత్వ పాల‌న ఆరు నెల‌లు గ‌డిచింది. ఇంకా జ‌గ‌న్ ప్ర‌భుత్వం విధ్వంసం సృష్టించింద‌ని, అందుకే ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌నే మాట‌ల్ని జ‌నం విశ్వ‌సించ‌రు. హామీలు ఇచ్చే స‌మ‌యానికి చంద్ర‌బాబు మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ప్ర‌తిప‌క్ష నాయ‌కులుగా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

అయిన‌ప్ప‌టికీ ఆకాశ‌మే హ‌ద్దుగా సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధి క‌లిగిస్తామ‌ని హామీలిచ్చారు. ఎలా సాధ్య‌మ‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నిస్తే, సంప‌ద సృష్టించి అంద‌జేస్తాన‌ని బాబు న‌మ్మ‌బలికారు. ఇప్పుడేమో రాత్రింబ‌వ‌ళ్లు ఆలోచిస్తున్నా, ప‌రిష్కారం దొర‌క‌డం లేద‌ని వాపోతున్నారు. ఇంత‌కంటే అన్యాయం మ‌రొక‌టి వుంటుందా? అని జ‌నం అనుకునే ప‌రిస్థితి. పాల‌న ఆరు నెల‌లే కావ‌డంతో ఇంకా జ‌నం విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం లేదు.

అంత‌కంటే ముందే, చంద్ర‌బాబే తాను చెప్పిన‌వ‌న్నీ అమ‌లు చేయ‌డం సాధ్యం కాద‌నే సంకేతాల్ని ఇవ్వ‌డానికి ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు. కానీ మోస‌పోయామ‌ని జ‌నం ఆగ్ర‌హిస్తే, వైసీపీ కంటే దారుణ‌మైన ఫ‌లితాల్ని ఎన్నిక‌ల్లో రుచి చూడాల్సి వుంటుంది. ఈ చేదు నిజాన్ని గ‌మ‌నంలో పెట్టుకుని చంద్ర‌బాబు జాగ్ర‌త్త‌గా మ‌స‌లుకుంటే మంచిది. అధికారంలోకి వ‌చ్చాం, అవ‌స‌రం తీరింది క‌దా అనుకుంటే మాత్రం శాశ్వ‌తంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుంది.

23 Replies to “జ‌నం అమాయ‌కుల‌ని అనుకుంటున్నారా బాబు!”

  1. జనం అమాయకులు అనుకుంటున్నరా?

    బాబాయి గుండె పొటు

    నారాసుర రక్త చరిత్ర

    సంపూర్ణ మద్యనిషెదం

    పింక్ డైమండ్

    32 కమ్మ DSP లు

    ఇన్సైడర్ ట్రెడింగ్

    3 రాజదానులు

    రెవెర్స్ టెండరింగ్

    దత్త పుత్రుడు

    25 లక్షల పక్క ఇల్ల నిర్మాణం

    ప్రతి ఎటా జాబ్ క్యలెండర్

    13 లక్షల పెట్టుబడులు

    కొడి కత్తి

    గులక రాయి

    నిజమె! జనం అమాయకులు అనుకుంటున్నరా?

    1. ఆయన పాలనలో చివరి నాటకం **గులక రాయి డ్రామా ** మరిచిపోయారు సార్. కానీ వారి దురదృష్టం ఏమంటే కోడి కత్తి డ్రామా డ్రామా రక్తి కట్టినట్టుగా గులక రాయి డ్రామా రక్తి కట్టలేదు

    2. Madhava reddy murder, paritala ravi murder, vangaveeti murder, Singapore five star hotel, lokesh swimming pool photos with girls, kaapuu reservation, heritage dolla companies Black money sree chaitnya, narayana colleges students suicide😁😁😁😁😁😁😁😁😁😁 Cbn rip

  2. అబివృద్ది పనులు, ఉపాధి అవకాశాలు ముమ్మరంగా జరుగుతున్నాయి..ఎటువంటి పధకాలు అవసరం లేదు. వృద్ధాప్య పించెన్, గ్యాస్ సీలిండర్స్ చాలు..దయచేసి అబివృద్ది కార్యక్రమాల మీద ఖర్చు చేయండి..99.99 శాతం చేశాం అన్న జగన్ ని గెలిపించారా?కాలం మారింది.. యువత పని కోసం చూస్తున్నారు..ఎన్నికలు,రాజకీయ భయాలు తో అప్పు తెచ్చిన డబ్బు పథకాల్ల పేరుతో నాశనం చేసి జనాల మీద పన్నుల భారం వెయ్యకండి.

  3. అయ్యా గ్యాస్ ఆంద్ర

    నువ్వు చెప్పినట్టుగానే ఆయన అన్ని మంచి పనులు చేస్తే ఇంతటి ఘోర పరాభవం ఎందుకు ఎదురయింది

    ఆయన చేసిన మంచి 10% ఆయన చెడు 90% అందుకే ఆ పది పర్సెంట్ 90% లో కొట్టుకుపోయింది.

    నువ్వు చెప్పినట్టుగానే జనాలు అమాయకులు కాదు కాబట్టి నిరంకుశ చక్రవర్తిని గద్దె దింపి కూటమి కి పట్టం కట్టారు. ఐదేళ్లు వైసిపి వారు చేసిన పని ఏమిటి

    పరిపాలనను గాలికి వదిలేసి పగలు రాత్రి టిడిపిని తిట్టడానికి సరిపోయింది. పవన్ కళ్యాణ్ మూడు భార్యల గురించి మాట్లాడడానికి టైం చాలా లేదు..

    చివరకు న్యాయాధి కారులను న్యాయ లయాలను కూడా వదలక ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇంత అరాచకం ఏ ముఖ్యమంత్రి హయంలోనైనా ఇంతవరకు జరిగిందా ? అవన్నీ మరిచిపోయి ఏవేవో నీతులు చెప్తున్నావే ? సజ్జన రామకృష్ణారెడ్డిని విమర్శించిన మీరు మరి మీరు చేసినదేమిటి వారు తానా అంటే మీరు తందాన అన్నారు కాబట్టి మీ పోస్టులకు విలువ లేకుండా పోయింది. వీడు వట్టి గ్యాస్ గాడు మీ ని దాంట్లో మేటర్ ఏమి ఉండదు

    అన్ని సొల్లు కబుర్లు ఉంటాయని ప్రజలకు అర్థం అయిపోయింది. కాబట్టే నీది గ్రేట్ ఆంధ్ర పోయి గ్యాస్ ఆంధ్ర అయింది

  4. 14 lakhs crore appu ani super 6 lu ichi eppudu 6.5 lakhs appu ani assembly lo cheppi sodi chepte vinataniki ee yellow flowers batch kaadu. Musukoni super 6 promise lu implement cheyye.

Comments are closed.