పుష్ప-2 దెబ్బ.. గేమ్ ఛేంజ్ అవుతుందా?

పుష్ప-2 హవా ఇంకా ముగియలేదు. ఉత్తరాదిన గేమ్ ఛేంజర్ కు ఇది పోటీ ఇవ్వడం పక్కా.

పుష్ప-2 సినిమా పెద్ద హిట్టవుతుందని చాలామంది ఊహించారు. కానీ ఎవ్వరూ ఊహించనంత విజయం సాధించింది అల్లు అర్జున్ సినిమా. ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించడంతో పాటు.. నెల రోజులు దాటినా నార్త్ బెల్ట్ లో తన హవా కొనసాగిస్తోంది.

ఇప్పుడీ సినిమా రికార్డుల్ని ‘గేమ్ ఛేంజర్’ క్రాస్ చేస్తుందా అనేది అందరి ఆలోచన. పుష్ప హిట్ వల్ల వచ్చిన క్రేజ్ తో పుష్ప-2 ఇంత పెద్ద హిట్టయితే.. ఆర్ఆర్ఆర్ సక్సెస్ వల్ల వచ్చిన క్రేజ్ తో గేమ్ ఛేంజర్ ఇంకెంత పెద్ద హిట్టవ్వాలి?

చెప్పుకోడానికి ఇది బాగుంది కానీ, పుష్ప-2 రికార్డుల్ని అందుకోవడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే, ఉత్తరాదిన ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల రూపాయల గ్రాస్ వస్తే, అందులో ఉత్తరాది వాటా 800 కోట్లు పైమాటే. సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. గేమ్ ఛేంజర్ కూడా నార్త్ బెల్ట్ లో ఈ స్థాయిలో ఆడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ ఉన్నాడు. పైగా అది రాజమౌళి సినిమా. గేమ్ ఛేంజర్ ను మాత్రం పూర్తిగా రామ్ చరణ్ తన భుజాలపై లాక్కెళ్లాల్సిన పరిస్థితి. పైగా పుష్ప-2 తరహాలో గేమ్ ఛేంజర్ పూర్తిస్థాయి మాస్-మసాలా చిత్రం కాదనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతోంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా దంగల్ నిలవగా, రెండో స్థానంలో పుష్ప-2 నిలిచింది. బాహుబలి-2 చిత్రాన్ని సైతం ఇది వెనక్కునెట్టింది. ఈ స్థాయిలో సక్సెస్ అవ్వాలంటే ముందుగా ఉత్తరాదిన గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాల్సి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో పుష్ప-2 ఎన్నో రికార్డులు బద్దలుకొట్టింది. అయితే వాటన్నింటికంటే ముందు పుష్ప-2 హిందీ వెర్షన్ సాధించిన రికార్డుల్ని గేమ్ ఛేంజర్ అధిగమించాల్సి ఉంది. ఆ తర్వాతే ఏదైనా! అన్నట్టు పుష్ప-2 హవా ఇంకా ముగియలేదు. ఉత్తరాదిన గేమ్ ఛేంజర్ కు ఇది పోటీ ఇవ్వడం పక్కా.

17 Replies to “పుష్ప-2 దెబ్బ.. గేమ్ ఛేంజ్ అవుతుందా?”

  1. Pushpa is a special magic which worked in north because they have never watched such a natural charecter with original emotions…. allu arjun & sukumar themselves may not repeat that magic again if they make another film after pushpa….. Game changer has no comparision with pushpa….

    1. Sankar outdated ayipoyadu. sankar ki songs baaga teestadani peru. tana 1st movie ninchi kooda annitlo songs baaga kharchu petti teestadu ani image undi. kani appudu story kooda baaga teesevadu. ippudu story vadilesi only songs tiyyatam meede focus pedutunnadu. anduke cinemalu ettipotunnaayi.

  2. Sequel cinema ki,stand alone movie ki comparison ela ra asalu,BB2 tarwatha prabhas cinema 1800 crs collect chesida? RRR tarwatha Devara vachindi ga mari adi 1200+ collect chesinda? Standalone ki sequel ki Theda theleeni nuvvoka journalist vi 🤦

  3. చెర్రీ బాబు కష్టపడతాడు కానీ ఎందుకో టైం కలిసి రాదు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వాల్సిన మగధీర ఒక్క తెలుగు లో తప్ప ఎక్కడ రిలీజ్ చేయలేదు ..లేదంటే ఫస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అయేవాడు ..రంగస్థలం కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ఐ సూపర్ హిట్ రావాల్సిన సినిమా అది అంతే వేరే ఎక్కడ రిలీజ్ చెయ్యలేదు ..rrr క్రేజ్ use చేస్కుని వెంట వెంటనే సినిమాలు చేసుకోవాల్సిన టైం లో డైరెక్టర్ వల్ల 3yrs గ్యాప్ ..త్రి ఇయర్స్ టైం ఉండి కూడా అటు నార్త్ లో గని other స్టేట్స్ లో గని ఇంకా proper ప్రమోషన్స్ చేసుకోలేని బాడ్ సిట్యుయేషన్ .చెన్నై ఈవెంట్ కూడా డౌట్ నే అంటున్నారు ..ఏదో అద్భుతం జరిగితే తప్ప సినిమా హిట్ అవటం కష్టమే ..

Comments are closed.