జపాన్ లో రాజాసాబ్ ఫంక్షన్

లాంగ్ గ్యాప్ తర్వాత మాస్ సాంగ్స్ తో వస్తున్నాడు ప్రభాస్. హీరోయిన్ తో డ్యూయట్స్ ఉన్నాయి.

తెలుగు సినిమా ప్రచారం ఖండాలు దాటేస్తోంది. మొన్నటివరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కలియతిరగడమే ఎక్కువ అనుకున్నాం. కానీ ఇప్పుడు దేశాలు దాటి ఫంక్షన్లు నిర్వహిస్తున్నారు.

మొన్నటికిమొన్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ఫంక్షన్లు యూఎస్ఏలో నిర్వహించారు. ఇప్పుడీ కల్టర్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్లబోతున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఏకంగా జపాన్ లో నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి.

“రాజాసాబ్ ఆడియో ఫంక్షన్ జపాన్ లో చేయాలనుకుంటున్నారు. అందుకే ఓ పాటకు జపాన్ వెర్షన్ చేయమని నన్ను అడిగారు”. ఇలా జపాన్ లో రాజాసాబ్ ఆడియో ఫంక్షన్ చేయబోతున్న విషయాన్ని తమన్ బయటపెట్టాడు. అంతేకాదు, ఈసారి రాజాసాబ్ లో పక్కా మాస్-కమర్షియల్ ఎలిమెంట్స్ చూస్తారని కూడా చెబుతున్నాడు.

“లాంగ్ గ్యాప్ తర్వాత మాస్ సాంగ్స్ తో వస్తున్నాడు ప్రభాస్. హీరోయిన్ తో డ్యూయట్స్ ఉన్నాయి. ఓ మాస్ సాంగ్ ఉంది. మరో ఐటెంసాంగ్ ఉంది. క్లయిమాక్స్ ముందు ముగ్గురు హీరోయిన్లతో ఓ సాంగ్ పెట్టాం. ఓపెనింగ్ ప్రభాస్ పై ఇంట్రడక్షన్ సాంగ్ కూడా ఉంది.”

ఇలా రాజాసాబ్ పక్కా మసాలా ప్యాకేజింగ్ తో వస్తోందని అంటున్నాడు తమన్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తక్కువ అంచనాలున్నాయని, తాము కూడా అదే కోరుకుంటున్నామని అన్నాడు. ఎంత తక్కువ అంచనాలతో వస్తే, థియేటర్లలో అంత ఎక్కువ ఎనర్జీ ఇస్తామంటున్నాడు.

11 Replies to “జపాన్ లో రాజాసాబ్ ఫంక్షన్”

  1. అంటే.. ఆ ఫంక్షన్ లో ప్రభాస్ జపనీస్ భాష లో మాట్లాడతాడా..?

    పుష్పా కంటైనర్ లో కూర్చుని పల్లీలు తింటూ 30 రోజుల్లో జపాన్ బాషా నేర్చుకున్నట్టు.. ప్రభాస్ కూడా నేర్చేసుకొంటాడేమో..

    ..

    “హాయ్ డార్లింగ్” ని జపాన్ భాష లో ఏమంటారో.. ఇప్పటి నుండే చెక్ చేసుకోవాలి..

  2. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి

  3. అసలు game changer సినిమా రిలీజ్ ఉందా లేక ఉగాదికేమైనా పోస్ట్ పోన్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారా? టీవీల్లో ఎక్కడా మినిమమ్ బజ్ కూడా లేకుండా భలేగా ప్లాన్ చేశారు… ఎవరో!

Comments are closed.