ఆంధ్ర నలుమూలలా కోడి పందాల పండుగ

ఇదో తరహా టూరిజం. పైగా వైకాపా ఇలాంటి ఆలోచనలు చేస్తే మన మీడియా గొంతు చించుకుంటుంది

భోగి.. సంక్రాంతి.. కనుమ.. ఇది ఓల్డ్ స్టైల్. తెలంగాణ బోర్డర్ దాటిన దగ్గర నుంచి గోదావరి జిల్లాలు దాటే వరకు ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాల పేరుతో ఫ్లెక్సీలు కనిపిస్తాయి. “స్వాగతం.. సుస్వాగతం” అంటూ ఆహ్వానాలు. పక్కన లోకల్ పొలిటికల్ లీడర్ల ఫొటోలు. బై డీఫాల్ట్‌గా ఒక కోడి పుంజు బొమ్మ. ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంటే గంగరెద్దులు, ఇంకా మరేవో సాంస్కృతిక కార్యక్రమాలు అనుకుంటే పొరపాటే. అసలు విషయం అచ్చమైన కోడి పందాలు, గుళ్ల ఆటలు. వాటితో పాటు మందు, విందు ఎలాగూ వుంటుంది.

గత అయిదేళ్ల ప్రధాన పత్రికల పత్రికలు తీసుకుని, జనవరి ఫస్ట్ వీక్ దాటిన దగ్గర నుంచి సంక్రాంతి వరకు వుండే పత్రికలను తిరగేస్తే ఆంధ్రలో మహాపరాధం జరిగిపోతోంది. అడ్డు అదుపు లేకుండా జూదాలు ఆడేస్తున్నారు అంటూ కథనాలు కనిపిస్తాయి. ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం,ఆదేశాలు హడావుడి కూడా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సంగతి వేరు.

మన కూటమి ప్రభుత్వం వచ్చింది. సంక్రాంతి వేడుకలను ఈ విధమైన జూదపు వేడుకలుగా ఘనంగా జరుపుకుందాం అని డిసైడ్ అయినట్లున్నారు. ఈ రోజు ఓ ప్రధాన దినపత్రికలో ఈ కొడిపందాల నిర్వహణ మీద డిటైల్డ్ కథనం వచ్చింది. ఎంత చక్కగా, ఎంత పద్దతిగా, ఎంత పాజిటివ్ గా వండి వార్చారో. మరి ఈ విధమైన శైలి గత అయిదేళ్ల పాటు ఎక్కడకు పోయిందో?

చక్కగా బరులు ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ని ఎకరాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత బాగా ఫ్లడ్ లైట్లు పెట్టారు. ఇన్ని లక్షలకు టెండర్లు పాడుతున్నారు. కొట్ల రూపాయలకు ఈవెంట్ ఆర్గనైజర్లకు కార్యక్రమ బాధ్యత అప్పగిస్తున్నారు అంటూ రాతలే తప్ప, ఇది దారుణం, ఇదేం పద్దతి, ప్రభుత్వం కళ్లు మూసుకుందా.. పోలీసులు ఏం చేస్తున్నారు లాంటి ఘాటు పదాలు ఎక్కడా లేవు.

ఇంకెందుకు ఆలస్యం. దశాబ్దాల కాలంగా ఈ సంక్రాంతి పందాల ఆచారం పెరుగుతూ వస్తోంది. టెక్నాలజీ, ఆధునిక హంగులు అందిపుచ్చుకుని నిర్వహించడం చాలా పద్దతిగా ఎదుగుతూ వస్తోంది. ఇలాంపుడు ప్రభుత్వమే వైన్ షాప్ లకు లైసన్స్ లు ఇచ్చినట్లు ఈ కోడి పందాల నిర్వణకు కూడా ఊరికి ఒకరికో, ఇద్దరికో వంతున లైసెన్స్ లు ఇచ్చేస్తే బాగుంటుంది కదా. ఎలాగూ ఆగడం లేదు. కోట్లకు కోట్లు చేతులు మారుతున్నాయి. ఎవరో లాభపడుతున్నారు.

అలాంటిది ప్రభుత్వమే కాస్త రూల్స్ అండ్ రెగ్యులేషన్లు పెట్టి, లైసన్స్ లు ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. తప్పేమీ కాదు. మద్యం ఆదాయం లాంటిదే ఇదీనూ. మన దేశంలో కావచ్చు. విదేశాల్లో కావచ్చు. అఫీషియల్ గా కాసినోలు నడుస్తున్నాయి కదా. అదే మాదిరిగా.

ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలు వుండేవి కాదు. మన డబ్బులు పట్టుకెళ్లి మైసూరులో అందించేవారు. మనం స్టార్ట్ చేసాం. అదే మాదిరిగా గోవా, శ్రీలంక వెళ్లి కాసినోలు ఆడుతున్నారు తప్ప మానడం లేదు. తెలంగాణ జనాలు అంతా కోడి పందాలకు ఏపీకి వేలాదిగా తరలివస్తున్నారు.

ఇదో తరహా టూరిజం. పైగా వైకాపా ఇలాంటి ఆలోచనలు చేస్తే మన మీడియా గొంతు చించుకుంటుంది తప్ప కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సాంస్కృతిక వికాసం అంటూ మద్దతు ఇస్తుంది. అందువల్ల ఇదే అదను.. ఆలోచన చేస్తే బెటర్.

21 Replies to “ఆంధ్ర నలుమూలలా కోడి పందాల పండుగ”

    1. ఆదే మన టైం లో అయితే రికార్డింగ్ డ్యాన్సులు, కాసినోలు అబ్బో అప్పట్లో వైభవం వేరు… కదండీ?

      1. Ray picha nakodaka, jatara season begins now. Goto any jatara, these are common scenarios even now..these things cbn gaani, vaadi babu

        , 2 acre asami gaani marchaledu..

        pk gaadu kuda peekidemi ledu..

        date cheptha, raasuko raa puka…from now until May end, every full moon night, there will be jatara begins in some part of seema..

        extra matladithe Kosi karam pedtaaru ro..

        anni musukuni padi undu

  1. అరెరే .. మన జగన్ రెడ్డి మీడియా సాక్షి లో .. ఆంధ్ర లో ప్రజలు అష్ట కష్టాల్లో ఉన్నారు.. పస్తులతో పడుకొంటున్నారు.. సంక్రాంతి వెలవెలబోతోంది అని రోజూ ఫ్రంట్ పేజ్ లో రాసుకుంటూ ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు..

    మీరేమో.. జనాలు పండగ ధూమ్ ధామ్ చేసుకొంటున్నారు అని రాస్తున్నారు..

    ..

    గత ఐదేళ్లలో కనపడని పండగ వాతావరణం ఇప్పుడు ఆంధ్ర నలుమూలలా ఉత్సాహం గా జరుపుకొంటున్నారు..

    మీ ఏడుపే.. ఈ రాష్ట్రానికి బలం..

  2. 4 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అంటాడు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోండి మనమే అంటాడు, నాకు పత్రికలు, TV లు లెవ్వంటాడు, 175 కి 175 ..ఎందుకు కాదు రజిని అంటాడు,4 గురుని లాగేస్తే ప్రతిపక్ష పాత్ర కూడా మిగలదు అని 11 తో నాకు ప్రతి పి..చ్చ హోదా కావాలి అంటాడు,పెద్దల సభ రద్దు చేసి పదెయ్యండి అని బిత్తర సత్తు లని MLC లు చేస్తాడు…

    ఎవుడ్రా eedu, ఈడు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు సామి:)

      1. మంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు..అవుతూనే వుంటాడు..

        జగన్ గా డు ఈ సారి మాజీ MLA అవుతాడు.. Mark My Words..

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  5. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.