సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే, ఆ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కు వస్తుందనే ఆలోచన అక్కర్లేదు. వీళ్లు ఏ సినిమా తీసినా అది నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమౌతుంది.
సాధారణంగా ఓ సినిమాను తలకెత్తుకునేముందు నిర్మాతలు ఎక్కువగా టెన్షన్ పడేది ఓటీటీ రైట్స్ గురించే. ఎందుకంటే, బడ్జెట్ లో ఎక్కువ షేర్ అక్కడ్నుంచే వస్తుంది. కొన్ని సినిమాలకు థియేట్రికల్ బిజినెస్ కంటే, ఓటీటీ రేటు ఎక్కువగా పలికిన సందర్భాలూ ఉన్నాయి.
అందుకే సినిమాకు కొబ్బరికాయ కొట్టిన వెంటనే ఓటీటీ సంస్థల వెంట పడతారు నిర్మాతలు. సితార బ్యానర్ కు మాత్రం ఆ సమస్య లేదు. ఎందుకంటే, సితార-నెట్ ఫ్లిక్స్ మధ్య ఏదో ‘గట్టి’ బంధం ఉన్నట్టుంది. వీళ్లు మూవీ ప్రారంభించడం ఆలస్యం, వాళ్లొచ్చి అగ్రిమెంట్ చేసుకొని వెళ్తారు.
ఈ ఏడాది డాకు మహారాజ్ తో ఖాతా తెరిచింది సితార. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న విజయ్ దేవరకొండ సినిమా, రవితేజ నటిస్తున్న మాస్ జాతర, మ్యాడ్ స్క్వేర్, అనగనగ ఒక రాజు.. ఇలా ఈ ఏడాది ‘సితార’ నుంచి రాబోతున్న సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ వే.
2025 సంవత్సరానికి గాను నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న తెలుగు సినిమాల్లో సింహభాగం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ వే. ఇవి కాకుండా ఓజీ, హిట్-2 లాంటి 2-3 సినిమాలు నెట్ ఫ్లిక్స్ ఖాతాలో ఉన్నాయి.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
OTT lo Amazon venuka padindi.
ఐతే వీటిని నెట్ ఫ్లిక్స్ లోనే చూస్తాం