ఊహించని విజయం ఇది

దశాబ్దానికి పైగా ల్యాబ్ కే పరిమితమైన ఈ సినిమా పొంగల్ కు కోలీవుడ్ లో రిలీజైంది ఊహించని విజయం సొంతం చేసుకుంది

సాధారణంగా ఆగిపోయిన సినిమాల గురించి మేకర్స్ పెద్దగా పట్టించుకోరు. ఎలాగోలా వదిలించుకోవాలని చూస్తారు. అయితే ఇలా వచ్చిన సినిమా ఊహించని విజయం సాధిస్తే మాత్రం మేకర్స్ షాక్ అవుతారు. ఇది అలాంటిదే.

దాదాపు పుష్కర కాలంగా వాయిదా పడుతూ వస్తోంది ‘మదగజరాజా’ సినిమా. విశాల్ హీరోగా నటించిన ఈ సినిమాను 2013లో రిలీజ్ చేయాలనుకున్నారు. అప్పట్నుంచి అది వాయిదాలు పడుతూనే ఉంది. ఓ ఐదేళ్లు ఎదురుచూసిన తర్వాత హీరోతో పాటు, ప్రేక్షకులు కూడా ఈ సినిమాను మరిచిపోయారు.

అలా దశాబ్దానికి పైగా ల్యాబ్ కే పరిమితమైన ఈ సినిమా పొంగల్ కు కోలీవుడ్ లో రిలీజైంది ఊహించని విజయం సొంతం చేసుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్టవుతుందని మేకర్స్ కూడా ఊహించలేదు.

సి.సుందర్ డైరక్ట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం తమిళనాట వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పొంగల్ సీజన్ కావడం, పైగా అజిత్ సినిమా వాయిదా పడ్డంతో, ఈ సినిమాకు జనం పోటెత్తుతున్నారు. 12 ఏళ్ల కిందట రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడొచ్చి హిట్టవ్వడంతో విశాల్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ సంతోషంలో అతడు పూర్తిగా కోలుకున్నాడు. అన్నట్టు తమిళనాట ‘గేమ్ ఛేంజర్’కు ఇది ఊహించని ఎదురుదెబ్బ.

5 Replies to “ఊహించని విజయం ఇది”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. ఒక మాదిరి సినిమా కోసం సంక్రాంతికి జనం మొహం వాచిపోయి ఉన్నారు.. ఇది cash చేసుకోలేని game changer ఒక పనికిమాలిన సినిమా.

    ఒక చిన్న లైను, 40 కామెడీ సీన్లతో సంక్రంతికి వస్తున్నాం అంటూ హిట్ కొట్టారు

Comments are closed.