మంగళవారం అయింది.. శనివారం వచ్చింది

వారాల పేరుతో మరో సినిమా వచ్చేసింది. నాని తన కొత్త సినిమాకు 'సరిపోదా శనివారం' అనే టైటిల్ పెట్టాడు. టైటిల్ వినడానికి చాలా కొత్తగా ఉంది. సినిమా ఎనౌన్స్ మెంట్ లో భాగంగా ఈరోజు…

వారాల పేరుతో మరో సినిమా వచ్చేసింది. నాని తన కొత్త సినిమాకు 'సరిపోదా శనివారం' అనే టైటిల్ పెట్టాడు. టైటిల్ వినడానికి చాలా కొత్తగా ఉంది. సినిమా ఎనౌన్స్ మెంట్ లో భాగంగా ఈరోజు రిలీజ్ చేసిన వీడియో చూస్తే ఇంకా కొత్తగా అనిపిస్తుంది. నాని లాంటి హీరో నుంచి, వివేక్ ఆత్రేయ లాంటి సెన్సిబుల్ డైరక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయరు. అదే ఈ సినిమాకు తొలి మేజిక్కు.

వీడియోలో నానీని గొలుసులతో కట్టేస్తారు. అందర్లానే అతడికీ ఓ రోజు వస్తుంది, ఆ రోజు శనివారం. అతడు తన గొలుసులు తెంచుకొని బయటకు వస్తాడు. అతడి రాకతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇలా సాగుతుంది నాని-ఆత్రేయ కొత్త సినిమా. వీడియో చూస్తుంటే.. డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకోవడంతో పాటు, ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నట్టు అనిపిస్తోంది.

సినిమాలో హీరో పాత్రకు, శనివారానికి బలమైన సంబంధం ఉన్నట్టు వీడియోలో చూపించారు. 'అన్ చెయిన్డ్” అంటూ విడుదల చేసిన ఈ వీడియోకు సాయికుమార్ వాయిస్ ఓవర్ అందించగా.. జేక్స్ బిజాయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. రేపు ఈ సినిమాను లాంఛ్ చేయబోతున్నారు.

హాయ్ నాన్న సినిమా పనులు పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతాడు నాని. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ పాన్ ఇండియా సినిమా. సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ను తీసుకున్నారు. విలన్ గా ఎస్ జే సూర్య నటించబోతున్నాడు.

ఇంతకుముందు నాని-ఆత్రేయ కాంబోలో అంటే సుందరానికి సినిమా వచ్చింది. సరిపోదా శనివారం అనేది వీళ్ల కాంబినేషన్ లో రెండో సినిమా.