వివాదంలోకి ఎమ్మెల్యేని లాగిన మంచు మ‌నోజ్‌

మంచు కుటుంబంలో వివాదం ఇంకా స‌ర్దుమ‌ణ‌గ‌లేదు. ముఖ్యంగా మంచు మ‌నోజ్ త‌న బాధ‌ను, ఆక్రోశాన్ని విడ‌త‌ల వారీగా వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు.

మంచు కుటుంబంలో వివాదం ఇంకా స‌ర్దుమ‌ణ‌గ‌లేదు. ముఖ్యంగా మంచు మ‌నోజ్ త‌న బాధ‌ను, ఆక్రోశాన్ని విడ‌త‌ల వారీగా వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. ఈ ద‌ఫా చంద్ర‌గిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నానీని వివాదంలోకి మ‌నోజ్ లాగ‌డం కొత్త ప‌రిణామం. ప్ర‌భుత్వం కూడా జోక్యం చేసుకోవాల‌ని మ‌నోజ్ స‌రికొత్త డిమాండ్‌ను తెర‌పైకి తేవ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

తాజాగా మంచు మ‌నోజ్ మాట్లాడుతూ మ‌రోసారి కుటుంబం వివాదాన్ని ప్ర‌స్తావించారు. త‌న తండ్రి పేరుతో ఉన్న యూనివ‌ర్సిటీలో హేమాద్రినాయుడు అరాచ‌కానికి పాల్ప‌డుతున్నాడ‌ని విమ‌ర్శించారు. త‌న వాళ్ల‌ను కొట్టి మ‌రీ డ‌బ్బు వ‌సూలు చేస్తున్నాడ‌ని మ‌నోజ్ ఆరోపించారు. యూనివ‌ర్సిటీ పీఆర్వోగా ఉన్న వ్య‌క్తి ఆడ‌వాళ్ల‌ను టార్గెట్ చేసుకుని దౌర్జ‌న్యాలు చేస్తున్న‌ట్టు మ‌నోజ్ మండిప‌డ్డారు.

తాను ఆస్తుల కోసం పోరాటం చేయ‌డం లేద‌ని, ఆత్మ‌గౌర‌వం కోసం చేస్తున్న‌ట్టు మ‌నోజ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లో త‌న‌కు బౌన్స‌ర్లు లేకుండా చేశార‌ని వాపోయారు. కానీ యూనివ‌ర్సిటీలో మాత్రం వంద‌లాది మంది బౌన్స‌ర్లు ఉన్నార‌న్నారు. రాత్రి అయితే చాలు మందు తాగి ర‌చ్చ చేస్తూ విద్యార్థుల్ని భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్న‌ట్టు మంచు మ‌నోజ్ ఆరోపించారు.

ఎంబీ యూనివ‌ర్సిటీ వ‌ద్ద త‌న వాళ్ల‌పై బౌన్స‌ర్లు క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడులు చేస్తున్నార‌ని, వీటిపై స్థానిక చంద్ర‌గిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని జోక్యం చేసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. స్థానికుల‌కు ధైర్యం చెప్పాల్సిన బాధ్య‌త పులివ‌ర్తి నానిపై వుంద‌న్నారు. అంతేకాదు, యూనివ‌ర్సిటీలో బౌన్స‌ర్లు లేకుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై వుంద‌ని ఆయ‌న గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం.

4 Replies to “వివాదంలోకి ఎమ్మెల్యేని లాగిన మంచు మ‌నోజ్‌”

  1. ఇతను సహాయం కోసం ఇక్కడా అక్కడా తిరిగి ఇతనికి కాళ్ళు బాగా లాగుతున్నట్టున్నాయి, అందుకే ఇప్పుడు వేరే వాళ్ళను లాగుతున్నాడు

Comments are closed.