అమ్మాయిల‌ను మోస‌గిస్తూ విలాస జీవితం!

తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిర‌ణ్‌రాయ‌ల్ బాధితురాలు ల‌క్ష్మి మ‌రోసారి అత‌నిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. జ‌న‌సేన నాయ‌కుడు నీచుడంటూ ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించారు.

తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిర‌ణ్‌రాయ‌ల్ బాధితురాలు ల‌క్ష్మి మ‌రోసారి అత‌నిపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. జ‌న‌సేన నాయ‌కుడు నీచుడంటూ ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించారు. త‌న లాయ‌ర్ బాలాతో క‌లిసి తిరుప‌తిలో ఆమె మీడియా స‌మావేశంలో మాట్లాడారు. రెండురోజుల క్రితం బెయిల్‌పై విడుద‌లైన ల‌క్ష్మి రాజ‌స్థాన్ నుంచి తిరుప‌తి చేరుకున్నారు.

త‌న‌పై కిర‌ణ్‌రాయ‌ల్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఆమె ఘాటుగా స‌మాధానం ఇచ్చారు. అమ్మాయిల‌ను అడ్డం పెట్టుకుని డ‌బ్బు సంపాదిస్తూ విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డుపుతున్న నీచుడిగా అభివ‌ర్ణించారు. కిర‌ణ్ రాయ‌ల్ ఏం బిజినెస్ ఏం చేస్తున్నాడ‌ని ఆమె ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల్ని మోస‌గించ‌డ‌మే అత‌ని వ్యాపార‌మ‌ని ఆమె తూర్పార‌ప‌ట్టారు. ముఖ్యంగా మ‌హిళ‌ల వ‌ద్ద డ‌బ్బు దోచుకుని రాజ‌కీయ నాయ‌కుడిగా చెలామ‌ణి అవుతున్నాడ‌ని ఆమె ఆరోపించారు.

అత‌నిలా తామెవ‌రినీ మోస‌గించి బ‌త‌క‌లేద‌ని ఆమె అన్నారు. కిర‌ణ్ మోసాల‌కు అత‌ని భార్య రేణుక కూడా మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని ఆమె ఆరోపించారు. కొంద‌రు మ‌హిళ‌ల‌ను కొట్టాడ‌ని ఆమె ఆరోపించారు. త్వ‌ర‌లో మ‌రికొంద‌రు బాధితులు మీడియా ముందుకొస్తార‌ని ఆమె ప్ర‌క‌టించారు. తన‌కు ఏ రాజ‌కీయ పార్టీతో సంబంధం లేద‌న్నారు.

త‌న వెనుక ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉన్నాడ‌ని కిర‌ణ్ రాయ‌ల్ చెప్తుండేవాడ‌న్నారు. ప‌వ‌న్ మ‌ద్ద‌తు చూసుకునే చెల‌రేగ‌పోతున్నాడ‌ని ల‌క్ష్మి ఆరోపించారు. ఆడ‌వాళ్ల‌ను కిర‌ణ్ మోస‌గించార‌నేందుకు త‌న వ‌ద్ద ఆధారాలున్నాయ‌న్నారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు బ‌య‌ట పెడ‌తాన‌న్నారు. త‌న‌కు ఇవ్వాల్సిన డ‌బ్బు ఇచ్చే వ‌ర‌కూ పోరాటం ఆగ‌ద‌ని ఆమె హెచ్చ‌రించారు.

8 Replies to “అమ్మాయిల‌ను మోస‌గిస్తూ విలాస జీవితం!”

  1. సనాతనం తో, తనూలత్తుక గుబాళింపు ఆగిన తర్వాత తుండు గుడ్డతో దేవాలయాలు తిరిగి పాపం కడిగేసుకుంటాడులే. ఇంక ఊకొ బిడ్డ

  2. నేను ఇంకా ja*** గాడి గురించి రాశావు అనుకున్న!! షెల్లి మరియు తల్లి ని మోసం చేసి లండన్ ట్రిప్స్ తో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు కదా!!!

Comments are closed.