ప్ర‌పంచ‌దేశాల‌తో పోటీలో ఉన్నామా.. రైల్వేస్టేషన్లో తొక్కిస‌లాటా!

దేశ రాజ‌ధానిలోని రైల్వేస్టేష‌న్లో తొక్కిస‌లాట జ‌రిగి ప్రాణాలు పోగొట్టుకునేంత ప‌రిస్థితుల్లో భార‌తీయులు బ‌తుకుతున్నార‌నే వార్త‌లు ప్రపంచ దేశాల మ‌ధ్య‌న మ‌న ప‌రువును ఎక్క‌డ‌కు తీసుకెళ్తాయి!

ఒక‌వైపు మ‌నం ప్ర‌పంచ‌దేశాల‌తో ప్ర‌గ‌తిలో పోటీ ప‌డుతున్నాం అని ప్ర‌క‌టించుకుంటూ ఉంటాం! ప్ర‌పంచం మ‌న‌వైపు చూస్తూ ఉందని గ‌ప్ఫాలు కొట్టుకుంటూ ఉంటాం! మోడీ అని, ఇమేజ్ అని, ప్ర‌పంచం మొత్తం అని, దార్శానిక‌త అని ఏదేదో చెప్పుకుంటూ ఉంటాం! మీడియాలో ఇలాంటి ప‌బ్లిసిటీ సాగుతూ ఉంటుంది!

క‌ట్ చేస్తే.. దేశ రాజ‌ధానిలో రైల్వే స్టేష‌న్ లో తొక్కిసలాట జ‌రిగి మ‌నుషుల ప్రాణాలు పోయాయానే వార్త‌లు కూడా ప్ర‌పంచం చూస్తూ ఉంటుంది సుమా! ఈ థ‌ర్డ్ వ‌ర‌ల్డ్ కంట్రీలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగితే పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. జ‌నాభా స‌మ‌స్య‌ల‌తో అల్లాడిపోయే నైజీరియాలోనో, మ‌నం మ‌త‌మౌడ్యంతో వెనుక‌బ‌డి ఉన్నాయని చెప్పే పాకిస్తాన్ లోనో, బంగ్లాదేశ్ లోనో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగితే.. అక్క‌డ అంతేలే అనుకోవ‌చ్చు!

మ‌రి మోడీ లాంటి ప్ర‌ధాన‌మంత్రి ప‌దేళ్లుగా ఏలుతున్న దేశంలో దేశ రాజ‌ధాని రైల్వేస్టేష‌న్లో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం అంటే.. ఇక విదేశీ మీడియా మ‌న‌ల్ని త‌క్కువ చేస్తోంది. విదేశాలు త‌క్కువ చూపు చూస్తున్నాయి. ఇండియ‌న్స్ అంటే చుల‌క‌న భావం ఉంది.. అంటూ వాపోవ‌డం కామెడీ కాదా!

దేశ రాజ‌ధానిలోని రైల్వేస్టేష‌న్లో తొక్కిస‌లాట జ‌రిగి ప్రాణాలు పోగొట్టుకునేంత ప‌రిస్థితుల్లో భార‌తీయులు బ‌తుకుతున్నార‌నే వార్త‌లు ప్రపంచ దేశాల మ‌ధ్య‌న మ‌న ప‌రువును ఎక్క‌డ‌కు తీసుకెళ్తాయి! రైల్వేస్టేష‌న్ల‌లో కూడా తొక్కిసలాట‌లు జ‌రుగుతాయిరా బాబూ ఇండియా వెళ్లిన‌ప్పుడు జాగ్ర‌త్త అంటూ రేపు ఏ వెస్ట్ర‌న్ కంట్రీనో త‌మ పౌరుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తే మ‌ళ్లీ వాళ్ల‌పై విరుచుకుప‌డేది మ‌న‌మే!

వాస్త‌వ‌మే కదా, పుష్క‌రాల‌కూ, వైకుంఠ‌ద్వార ద‌ర్శ‌నాల టికెట్ల‌కు వెళ్లి ప్రాణాల‌ను కోల్పోతున్నారు ఈ దేశంలో! వాటి నిర్వ‌హ‌ణ చేసేది మ‌రెవ‌రో కాదు, దేశానికి ఐటీ పాఠాలు నేర్పిన మాస్టారే! ఆయ‌న నాయ‌క‌త్వంలో, ఆ విజ‌న‌రీ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో న‌డిచే వ్య‌వ‌స్థ‌ల ఆధ్వ‌ర్యంలో, ఆ మాస్టారు అధికారంలో ఉన్న వేళావిశేషంలోనే పుష్క‌రాల్లో ప్రాణాలు పోతాయి, తిరుప‌తిలో తొక్కిసలాట జ‌రిగి ప్రాణాలు పోతాయి వారు ప్ర‌పంచ స్థాయి నేత‌. ఆయ‌న విజ‌న‌రీ గురించి ద‌శాబ్దాలుగా వింటూనే ఉన్నాం! అలాంటి నేత‌లు ఉండ‌టం మ‌న పాలిట అదృష్టం అని దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగిన మ‌రుస‌టి రోజు నుంచినే మ‌ళ్లీ ప్ర‌చార ప‌ర్వం సాగుతుంది!

మోడీ ప్ర‌ధాని అయ్యాకా.. రైలన్నీ మారిపోయాయి, ఫ్లాట్ ఫామ్ టికెట్ రేట్ల‌ను ప‌తాక స్థాయికి తీసుకెళ్లి మొత్తం రైల్వే వ్య‌వ‌స్థ‌ను మోడీ మార్చేశాడు అనే మాట‌లు 2014 నుంచి వింటూనే ఉన్నాం! సినిమాల్లో కూడా ఈ డైలాగులు పెట్టారు! అయితే రైలు ప్ర‌మాదాల సంగ‌త‌లా ఉంచి, రైలు ఎక్కేందుకు తొక్కిసలాట జ‌రిగేంత దుస్థితిలో భార‌త రైల్వే కూన‌రిల్లుతూ ఉంది. రైల్వే మంత్రేమో ప‌రిస్థితి అంతా అదుపులో ఉందంటారు! ఏముంది ఇక‌.. రేప‌టి నుంచి అంత‌ర్జాతీయ ప్ర‌తిష్ట‌లో భార‌త స్థాయి ప‌తాక స్థాయిలో ఉందంటూ మ‌ళ్లీ గప్ఫాలు కొట్టుకోవ‌డ‌మే! ఇలాంటి ఘ‌ట‌న‌లు ఏముంది.. ఏదో ఒక‌టి దొర‌క్క‌పోదా ఇలాంటివి మ‌రపింప‌జేయ‌డానికి, జాతీయవాద జోల‌పాట పాడ‌టానికి!

9 Replies to “ప్ర‌పంచ‌దేశాల‌తో పోటీలో ఉన్నామా.. రైల్వేస్టేషన్లో తొక్కిస‌లాటా!”

  1. ఈ ఎదవకు ఎవరైనా కొద్దిగా చెప్పండి. తొక్కిశాలాటల్లో ఒక్క ఢిల్లీలోనే కాదు అమెరికా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ స్పేయిన్ లాంటి దేశాల్లో కూడా జరిగాయి జరుగుతూనే ఉన్నాయి. ఫుట్ బాల్ ఆట మధ్యలో కూడా తొక్కిశాలాట జరిగి చనిపోయారు.

    ఒక్కసారిగా ప్లాట్ఫారం కేపాసిటి కి 10 రెట్లు జనం వస్తే, రాగూడదని మోదీ అడ్డం పడుకోవాలా?

    ప్రతి ఎదవా విశ్లేషణ చేసే వాడే

  2. కాల్ బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా,

  3. జగన్ అన్న అయి ఉంటె ప్రపంచ దెశాలొ ముందు వరసలొ నుల్చొబెట్టెవాడు! ఎందులొ అంటావా? అడుక్కుతునటంలొ!!

    1. చెంబా తనది ఎల్. కే. జీ స్టాండర్డ్ అనీ ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్నాడు,

  4. తొక్కిసలాట లని వేరే కోణంలో అంటే ఇతర దేశాల దృష్టిలో చూస్తే మీరు చెప్పింది ఎంత కరెక్టో కదా…మంచి విశ్లేషన..

Comments are closed.