రాజకీయాలకు గుడ్ బై చెప్పి, వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయిరెడ్డి మాటల్లో నిలకడలేదని వైసీపీ అనుమానిస్తోంది. మళ్లీ వైసీపీలోకి వెళ్లనని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా సందర్భంలో ఢిల్లీలో విజయసాయి మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్‌కు, నిన్న విజయవాడలో మాటలకు తేడా కనిపించడంపై వైసీపీ నేతలు సీరియస్‌గా స్పందిస్తున్నారు.
కోటరీ వల్లే తాను జగన్‌కు దూరమయ్యానని విజయసాయిరెడ్డి మాట్లాడ్డాన్ని వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. విజయసాయిరెడ్డి విమర్శలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆ మధ్య రాజకీయాలకు దూరంగా వుంటానని విజయసాయిరెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడేమో కోటరీ వల్లే తాను జగన్‌కు దూరమయ్యానని చెబుతున్నారని, ఆయన మాటల్లో ఏదో తేడా కనిపిస్తోందన్నారు.
విజయసాయిరెడ్డి తాజా కామెంట్స్ మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తారనే అనుమానాల్ని కలిగిస్తున్నాయన్నారు. జగన్ కోటరీ అంటే ప్రజలే అని ఆయన అన్నారు. అయినా ఏ పార్టీకి కోటరీ వుండదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలో లేకపోవడంతో పార్టీని వీడుతున్నారని, ఏవేవో మాట్లాడుతున్నారని ఆయన తప్పు పట్టారు. వైసీపీ అధికారంలో వుంటే ఈ నాయకులంతా ఇలాగే మాట్లాడే వాళ్లా? అని ఆయన ప్రశ్నించారు.
మొన్నటి వరకు ఇదే కోటరీలో విజయసాయిరెడ్డి ఉన్నారన్నారు. కోటరీ గురించి విజయసాయిరెడ్డి మాట్లాడితే ఏం బాగుంటుందని ఆయన నిలదీశారు. ఒకరిపై ప్రేమ పుడితేనే, మరొకరిపై ప్రేమ విరిగిపోతుందన్నారు. మరి విజయసాయిరెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో తెలియదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అయినా పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకుడి నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేమన్నారు.
Probabilities.
1. Natakam. Kumakku.
2. Extra chesthe narasura story repeat cheyochu ane dhairyam vokariki, venaka Anda vundhane dhairyam inkokariki.
3. Maro Kiran kumar reddy yemo power central dhaggara… It will be boomerang definitely.
Veedoka keti gaadu aa party lo.
ఎటు ఎల్లకాలం గుడ్డు గుడ్డు లా ఉండదు ఆమ్లెట్ అవ్వాల్సిందే కడుపులో కి వెళ్ళక తప్పదు..
ఇంతకీ గుడ్లు పొదిగాడా లేదా?
వ్యవసాయం x కోళ్లపెంపకం
Ohh
ఈ గుడ్డు గాడు తీసుకుని వచ్చిన బొబ్బట్ల కంపెనీ డెవలప్ అయ్యి, 20 ట్రిలియన్ డాలర్ల కంపెనీ అయ్యి, కేవలం ఆంధ్ర నే కాకుండా భారత దేశాన్నే సుసంపన్నదేశంగా మార్చేసింది.
దేశంలో నిరుద్యోగం, పేదరికం నిర్మూలించబడ్డాయి