నో టెన్షన్.. ఏడాదికో సినిమా పక్కా

ఎన్టీఆర్ నుంచి ఈ ఏడాది సినిమా ఉంది. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే వార్-2 సినిమా పంద్రాగస్టు కానుకగా, ఆగస్ట్ 14న రాబోతోంది.

ఈ ఏడాది ఇక ఎన్టీఆర్ నుంచి సినిమా లేనట్టేనా? నిన్నటివరకు జరిగిన చర్చ ఇది. హృతిక్ రోషన్ గాయపడ్డంతో, వార్-2 వాయిదా పడిందని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఫ్యాన్స్ కు కిక్కిచ్చే వార్త బయటకొచ్చింది.

ఎన్టీఆర్ నుంచి ఈ ఏడాది సినిమా ఉంది. ఇంతకుముందు ప్రకటించినట్టుగానే వార్-2 సినిమా పంద్రాగస్టు కానుకగా, ఆగస్ట్ 14న రాబోతోంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

గతేడాది దేవర-1 సినిమా చేసిన ఎన్టీఆర్, ఈ ఏడాది వార్-2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నాడు. ఆ వెంటనే దేవర-2 లేదా నెల్సన్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది.

ఇలా ఏటా ఒక సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేశాడు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ హీరో కెరీర్ లో లాంగ్ గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ గ్యాప్ ను ఇలా భర్తీ చేసే పనిలో పడ్డాడు ఎన్టీఆర్.

3 Replies to “నో టెన్షన్.. ఏడాదికో సినిమా పక్కా”

Comments are closed.