నీకు పదిహేను.. బాబు ఇచ్చేస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే

ఇపుడు ఈ హామీలు బాబు అమలు చేస్తామని అదే పార్టీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే చెబుతున్నారని అంటున్నారు.

నీకు పదిహేను నీకు పదిహేను అన్నది ఎన్నికల ముందు టీడీపీ నేతలు ప్రతీ ఇంటికీ వెళ్ళి కరపత్రాలు పంచి మరీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలుగా ఈ రోజుకీ సోషల్ మీడియాలో భద్రంగా ఉన్నాయి. ఈ హామీల విషయంలో అందరి కంటే ఎక్కువగా ప్రచారం చేసిన గోదావరి జిల్లాలకు చెనిన ఒక టీడీపీ మంత్రి గారు హైలెట్ అయ్యారు.

ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గడచిన తొమ్మిది నెలలుగా హామీలు అమలు కావడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. వారు ఆ గోదావరి మంత్రి గారి వీడియోని కూడా సోషల్ మీడియాలో పెట్టి మరీ కూటమిని గట్టిగా గుచ్చుతున్నారు.

తల్లికి వందనం పధకం కింద ప్రతీ ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు వంతున కూటమి ప్రభుత్వం ఇస్తుందని బీజేపీకి చెందిన విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు హామీ ఇచ్చారు. మే నెల నుంచి ఈ హామీని అమలు చేస్తామని చంద్రబాబు అంగీకరించారని ఆయన విశాఖలో జరిగిన సభలో చెప్పారు.

ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే ఆ కుటుంబానికి అరవై వేల రూపాయలు వస్తాయని ఆయన చెప్పడం విశేషం. నలుగురు పిల్లలకు ఈ పధకం అలా ఇస్తారని ఆయన అంటున్నారు. సూపర్ సిక్స్ హామీల మీద ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తే ఆ హామీ పత్రాన్ని పట్టుకోవడానికి బీజేపీ నేతలు అయితే ఎవరూ ముందుకు రాలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఈ హామీల భారం అంతా టీడీపీదే అన్నట్లుగా కమలనాధులు వ్యవహరించారు. ఇపుడు ఈ హామీలు బాబు అమలు చేస్తామని అదే పార్టీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే చెబుతున్నారని అంటున్నారు. పైగా అరవై వేలు దాకా గరిష్ట మొత్తం వస్తుందని ఊరిస్తున్నారు. అయితే ఈ హామీలు నెరవేర్చితే మొత్తం కూటమి ప్రభుత్వానికి అందులో ఉన్న బీజేపీకి కూడా పేరు వస్తుంది, తేడా కొడితే మాత్రం టీడీపీకే ఇబ్బంది అని అంటున్నారు. ఈ పధకం విషయంలో బీజేపీ ముందస్తుగా జనంలోకి వచ్చి పెడుతున్న ఆశలు కనుక పూర్తి స్థాయిలో అమలు కాకపోతేనే తంటా అని అంటున్నారు.

4 Replies to “నీకు పదిహేను.. బాబు ఇచ్చేస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే”

  1. మనది కాక పొతే కాశీ దాకా దేకమన్నాట్ట…ఇవ్వాల్సింది బాబు కదా ఈయన ఎన్నయినా చెపుతాడు

Comments are closed.