జగ్గారెడ్డిగా ప్రజలందరికీ తెలిసిన కాంగ్రెస్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి.. ఇప్పుడు సినిమా నటుడిగా అవతారం ఎత్తబోతున్నారు. ప్రేమను రక్షించే ఒక సీరియస్ నాయకుడిగా ఆయన పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉంటుంది. దర్శకుడు రామానుజం ఆయన ఫోటో ఒకటి తీసుకువెళ్లి చూపించగానే.. దానికి ఫ్లాట్ అయి సినిమా చేయాలని డిసైడ్ అయినట్టుగా జగ్గారెడ్డి మీడియాకు చెప్పారు. ఈ సినిమాలో జగ్గారెడ్డిది ఎంతటి కీలకమైన పాత్ర అంటే.. ‘ఏ వార్ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్ లైన్ ఉన్నప్పటికీ.. సినిమా అసలు టైటిల్ ‘జగ్గారెడ్డి’నే!
డైరక్టరు వచ్చి కలిసినప్పుడు ఇంప్రెస్ అయ్యానని, ఆయన ఫోటో చూపించిన తర్వాత ఈ సినిమా చేయాలని డిసైడయ్యానని అంటున్నారు. అలాగే.. సగం కథ డైరక్టరు రామానుజం తయారుచేయగా.. మరో సగం కథను జగ్గారెడ్డి స్వయంగా తన జీవితంలోని ఘటనలతో నింపినట్టుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. ఉగాదికి ప్రారంభం కాబోతున్న ఈ సినిమా ముచ్చట్లన్నీ పక్కన పెడితే.. రాజకీయంగా ఆయన ఆశించిన భవిష్యత్తు గురించి పార్టీ ప్రామిస్ చేయనందువల్లనే ఆయన సినిమాల్లోకి అడుగుపెడుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
జగ్గారెడ్డి మీడియాతో పంచుకున్న మాటలే ఇలాంటి అనుమానాలు కలిగిస్తున్నాయి. ఒకప్పట్లో తాను కూడా రాష్టానికి ముఖ్యమంత్రి కాగలనని, పీసీసీ చీఫ్ తప్పకుండా అవుతానని రకరకాలుగా బీరాలు పలికిన వ్యక్తి జగ్గారెడ్డి. ఆయన ఇప్పుడు స్టేట్ పార్టీలో ఇప్పుడు తన అవసరం లేదని అంటున్నారు. అదే సమయంలో ఢిల్లీ టూర్ తనను పూర్తిగా మార్చేసిందని కూడా చెబుతున్నారు. దీని పరిణామాలు ఎటు పోతాయో తనకు తెలియదని అంటున్నారు.
మళ్లీ నియోజకవర్గ ప్రజలు తనను దూరం పెట్టకుండా ఉండేందుకు .. తమ పార్టీ అధికారంలో ఉన్నది గనుక.. సంగారెడ్డికి ఎక్కువ నిధులు తీసుకువెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అంటూనే.. రాజకీయ భవిష్యత్తు ఆశలు ఉడిగిపోయినట్టుగా మాట్లాడుతున్నారు జగ్గారెడ్డి.
కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యం పెరగడం గురించి ఆయన ఢిల్లీ టూర్లో పార్టీ పెద్దల వద్ద తన డిమాండ్లు వినిపించారని, అయితే, ఆయన ప్రతిపాదనలకు పార్టీ సుముఖంగా లేకపోవడంతో.. ఇప్పట్లో తాను పార్టీలో, ప్రభుత్వంలో ఆశించే భవిష్యత్తు దొరకబోదని ఆయనకు అర్థమైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ‘నేను సినిమాల్లోకి వెళ్లడానికి ఢిల్లీ టూర్ పనికొచ్చింది’ అనే మాట అందుచేతనే జగ్గారెడ్డి పలికి ఉంటారని కూడా అనుకుంటున్నారు.
Ohh
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,