రాజాసాబ్… ఈ సినిమా ఇప్పటిది కాదు. చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. మరి సాంగ్స్ సంగతేంటి.. అప్పుడెప్పుడో తమన్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పుడు పనికొస్తాయా? ప్రేక్షకుల్ని మెప్పిస్తాయా?
దీనిపై తమన్ స్పందించాడు. రాజా సాబ్ కోసం గతంలో తను కంపోజ్ చేసిన ట్యూన్స్ అన్నింటినీ చెత్త బుట్టలో పడేశానని, ఇప్పుడు ఫ్రెష్ గా పాటలిస్తున్నానని ప్రకటించాడు.
“రాజాసాబ్ కోసం ఇప్పటికే చాలా సాంగ్స్ కంపోజ్ చేశాం. కానీ అవన్నీ చెత్తబుట్టలో పడేశాం. ఎందుకంటే, టైమ్ లైన్ మారిపోయింది. ట్రెండ్ మారిపోయింది. టెక్నాలజీ మారుతోంది. దానికి తగ్గట్టే పాటలివ్వాలి. అప్పుడెప్పుడో కంపోజ్ చేసిన పాటలవి. ఆ ట్యూన్స్ అన్నీ ఇప్పుడు డెడ్ అయిపోయాయి.”
పాటలన్నీ మళ్లీ కంపోజ్ చేయాలనే నిర్ణయాన్ని తనే తీసుకున్నట్టు వెల్లడించాడు తమన్. ఇదే విషయాన్ని దర్శక-నిర్మాతలకు చెప్పి ఒప్పించానని అన్నాడు. ప్రభాస్ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నప్పుడు, తన పాటల కోసం ఆడియో కంపెనీలు 30-40 కోట్లు పెడుతున్నప్పుడు మంచి మ్యూజిక్ ఇవ్వడం తన బాధ్యతగా చెప్పుకొచ్చాడు.
మరి ఈ నిర్ణయం రాజాసాబ్ షూటింగ్ కు అడ్డంకి కాలేదా? అస్సలు అడ్డంకి కాలేదంటున్నాడు తమన్. ఎందుకంటే, నిన్నమొన్నటివరకు రాజాసాబ్ టాకీ మాత్రమే కంప్లీట్ చేశారట. అలా టాకీ పార్ట్ పూర్తిచేసి, ఇప్పుడు సాంగ్స్ షూట్ చేస్తున్నారు. సో.. సినిమా వాయిదా పడడానికి ఇది కూడా ఓ కారణమనే విషయాన్ని తమన్ పరోక్షంగా వెల్లడించినట్టయింది.
Nice songs
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,