ర‌ఘురామ కేసులో విచార‌ణ‌కు వెళ్లండ‌మ్మా!

డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజు క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ కేసులో విచార‌ణ‌కు స‌హక‌రించాల‌ని డాక్ట‌ర్ ప్ర‌భావ‌తిని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది.

డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజు క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ కేసులో విచార‌ణ‌కు స‌హక‌రించాల‌ని డాక్ట‌ర్ ప్ర‌భావ‌తిని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. ఈ నెల 7, 8 తేదీల్లో విచార‌ణ‌కు వెళ్లాల‌ని, లేదంటే ముంద‌స్తు బెయిల్‌ను ర‌ద్దు చేయాల్సి వ‌స్తుంద‌ని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం హెచ్చ‌రించడం గ‌మ‌నార్హం. క‌స్టోడియ‌ల్ విచార‌ణ‌లో రఘురామ‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని డాక్ట‌ర్ ప్ర‌భావ‌తి స‌ర్టిఫై చేశారు. దాన్ని స‌వాల్ చేస్తూ కూట‌మి ప్ర‌భుత్వం డాక్ట‌ర్ ప్ర‌భావ‌తిపై కేసు న‌మోదు చేసింది.

అయితే సుప్రీంకోర్టు వ‌ర‌కూ ఆమె పోరాటం చేసి, ముంద‌స్తు బెయిల్ పొందారు. అరెస్ట్ కాకుండా ఉప‌శ‌మ‌నం పొందారు. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో అంట‌కాగి, ర‌ఘురామ కేసులో త‌ప్పుడు వైద్య నివేదిక ఇచ్చార‌నేది కూట‌మి ప్ర‌భుత్వ ఆరోప‌ణ‌. మ‌రోవైపు సుప్రీంకోర్టు ఆదేశానుసారం విచార‌ణ‌కు హాజ‌రు కాలేద‌ని ప్ర‌భుత్వం తాజాగా వాదిస్తోంది. దీంతో ఆమెకు ఇచ్చిన ఉప‌శ‌మ‌నాన్ని ర‌ద్దు చేయాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ప్ర‌భుత్వం ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం.

పిటిష‌న్‌పై జ‌స్టిస్ విక్ర‌మ్‌నాథ్‌, జ‌స్టిస్ కె.విశ్వ‌నాథ‌మ్‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే విచార‌ణ‌కు పిలిచి, ఆ త‌ర్వాత పిల‌వ‌కుండానే విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేదంటే ఎలా అని డాక్ట‌ర్ ప్ర‌భావ‌తి త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. అయితే విచార‌ణ‌కు రాలేన‌ని ఒక‌సారి లాయ‌ర్‌తో, మ‌రోసారి త‌న భ‌ర్త ద్వారా స‌మాచారం పంపార‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు.

అందుకే ఆమె అరెస్ట్ కాకుండా ఇచ్చిన రిలీఫ్‌ను ర‌ద్దు చేయాల‌ని న్యాయ‌స్థానాన్ని ప్ర‌భుత్వం కోరింది. ఈ నేప‌థ్యంలో ఈ నెల 7,8 తేదీల్లో నిర్దేశించిన పోలీస్‌స్టేష‌న్‌లో విచార‌ణ‌కు ఉద‌యం 10 గంట‌ల‌క‌ల్లా హాజ‌రు కావాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. దీంతో డాక్ట‌ర్ ప్ర‌భావ‌తి త‌ప్ప‌నిసరిగా విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

11 Replies to “ర‌ఘురామ కేసులో విచార‌ణ‌కు వెళ్లండ‌మ్మా!”

  1. ఇంకొక “వైసీపీ ధీర వనిత”..

    జగన్ రెడ్డి కోసం తన కెరీర్, పేరు, సంఘం లో స్థానం కోల్పోయిన ఇంకో “షెల్లమ్మ”..

    తప్పు చేయకపోతే విచారణ కి వెళ్ళడానికి భయమెందుకు..

    ఆ తప్పు ఎవరికోసం చేసింది..? ఎవరిని సంతోషపరచడం కోసం చేసింది..

    ఆ దుర్మార్గుడు ఇప్పుడు హ్యాపీ గా బెంగుళూరు పాలస్ లో ఉన్నాడు.. వాడి మాట నమ్మి తప్పులు చేసిన వాళ్లకు “తల జుట్టు” కు రంగు వేసుకోడానికి కూడా లేకుండా బతుకుతున్నారు..

  2. అంజు యాదవ్ కి ఆమె మీద ఉన్న కేసు లు సెటిల్ చేస్తాము ఈమె చేత నిజం చెప్పిస్తే అని ఆఫర్ ఇస్తే రెండు రోజులు కు నిజం డాక్టర్ గారు బయటకు కక్కేస్తాది

  3. సూత్రధారులు సజ్జల గారిని వదిలేసి పాత్రధారులు డాక్టర్స్ ని వేధిస్తే ఏమి లాభం.

  4. అంజు యాదవ్ కి ఆమె మీద ఉన్న కేసు లు సెటిల్ చేస్తాము ఈమె చేత నిజం చెప్పిస్తే అని ఆఫర్ ఇస్తే రెండు రోజులు కు నిజం డాక్టర్ గారు బయటకు కక్కేస్తాది

Comments are closed.