నాగబాబు ఎందుకు సినిమాలు తగ్గించేశారు?

కాస్త జాగ్రత్తగా గమనిస్తే, ఈమధ్య నాగబాబు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. అలా అని ఆయన పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా లేరు. ఆరోగ్య సమస్యలు కూడా లేవు. పైపెచ్చు ఫిజికల్ గా…

కాస్త జాగ్రత్తగా గమనిస్తే, ఈమధ్య నాగబాబు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. అలా అని ఆయన పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా లేరు. ఆరోగ్య సమస్యలు కూడా లేవు. పైపెచ్చు ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉన్నారు. మరి ఇలాంటి టైమ్ లో ఆయన ఎందుకు సినిమాలు తగ్గించేశారు?

సిల్వర్ స్క్రీన్ పై తండ్రి పాత్రలకు నాగబాబు సరిగ్గా సరిపోతారు. కానీ ఆయన క్యారెక్టర్ రోల్స్ చేయడం లేదు. అలా అని కెరీర్ లో ప్రయోగాలు కూడా చేయడం లేదు. ఇవే విషయాల్ని నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ వద్ద ప్రస్తావించింది గ్రేట్ ఆంధ్ర. దీనికి ఆయనిచ్చిన సమాధానం ఇది.

“నాన్నగారు వెళ్లి ఎవ్వర్నీ రోల్స్ అడగరు. ఆర్టిస్టులన్న తర్వాత అప్రోచ్ అవ్వాలి. నాన్న ఎవ్వరీ కలవరు. కాకపోతే ఆయన స్పేస్ లో ఆయన హ్యాపీ. నాకు ఒక సినిమా చాలు, ఓ టీవీ షో చాలు, ఇంటికొచ్చి మాతో ఛిల్ అవుతానంటారు. కానీ నా ఉద్దేశంలో ఆయన సినిమాలు చేయాలనే నేను కోరుకుంటాను. పైగా ఈమధ్య నాన్న బాగా సన్నబడ్డారు, వెజిటేరియన్ అయ్యారు. కాబట్టి నేనైతే సినిమాలు చేయమనే అడుగుతాను.”

రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ లోనే చిరంజీవి తనయుడి సినిమాలో కనిపించారు. కెరీర్ లో ఇప్పటివరకు నాగబాబు-వరుణ్ తేజ్ కలిసి నటించలేదు. కావాలనే వద్దనుకున్నాం అంటున్నాడు వరుణ్.

“నాన్న, నేను తండ్రికొడుకులుగా చేయాలని అనుకున్నాం. 2-3 సినిమాల్లో అలాంటి సందర్భాలు కూడా వచ్చాయి. కానీ ఆన్ స్క్రీన్ పై అలా చేస్తే అది ఫేక్ గా ఉంటుందని మా ఉద్దేశం. అందుకే ఇద్దరం వద్దని అనుకున్నాం. కానీ ఏదైనా మంచి పాత్ర దొరికితే నాన్నతో కలిసి చేయాలని ఉంది.”

వరుణ్ తేజ్ నటించిన గని సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీ కోసం బాక్సింగ్ లో ట్రయినింగ్ తీసుకున్నాడు. సినిమాలో తను చేసే బాక్సింగ్, ప్రొఫెషనల్స్ కు కూడా నచ్చుతుందంటున్నాడు వరుణ్ తేజ్.