బాల‌కృష్ణ సినిమాలోనూ విల‌న్ రెడ్డే, మ‌రి హీరో?

ఇటీవ‌లే పుష్ప సినిమాలో నెగిటివ్ క్యారెక్ట‌ర్ల‌కు రెడ్డి పేర్ల‌ను పెట్టిన వైనం చ‌ర్చ‌లో నిలిచింది. టాలీవుడ్ ద‌శాబ్దాలుగా విల‌న్ పాత్ర‌ల‌కు రెడ్డిని త‌గిలించ‌డం అల‌వాటుగా మార్చుకుంది.  Advertisement అదేమంటే హీరో పాత్ర‌ల‌కు రెడ్డి అని…

ఇటీవ‌లే పుష్ప సినిమాలో నెగిటివ్ క్యారెక్ట‌ర్ల‌కు రెడ్డి పేర్ల‌ను పెట్టిన వైనం చ‌ర్చ‌లో నిలిచింది. టాలీవుడ్ ద‌శాబ్దాలుగా విల‌న్ పాత్ర‌ల‌కు రెడ్డిని త‌గిలించ‌డం అల‌వాటుగా మార్చుకుంది. 

అదేమంటే హీరో పాత్ర‌ల‌కు రెడ్డి అని పెడితే హ్యాపీనే అనే ఎదురుప్ర‌శ్నను కూడా కొంద‌రు టాలీవుడ్ మేధావులు వేస్తున్నారు. అలాంటి సంద‌ర్భాల్లో విల‌న్ల పేర్ల‌కు కూడా రెడ్డి పేరునే పెడుతున్నార‌నే విష‌యాన్ని క‌న్వీన్సింగ్ మ‌రిచిపోతున్నారు.

టాలీవుడ్ కు ఈ పైత్యం ఏ స్థాయిది అంటే, కొంద‌రు తెలుగు ద‌ర్శ‌క‌రాజాలు హిందీలో సినిమాల‌ను తీసినా.. విల‌న్ల‌కు రెడ్డి అని పేరు పెట్టి ఆనందం పొందారు! అలాంటి ఉదాహ‌ర‌ణ‌లు కూడా బోలెడ‌న్ని ఉన్నాయి. 

ఆ సంగ‌త‌లా ఉంటే.. తాజాగా నందమూరి బాల‌కృష్ణ కొత్త సినిమాకు సంబంధించి విల‌న్ ను ప‌రిచ‌యం చేస్తూ, అత‌డి కేరెక్ట‌ర్ పేరును కూడా అనౌన్స్ చేశారు.

ముస‌లి మ‌డుగు ప్ర‌తాప‌రెడ్డి.. ఇదీ బాల‌కృష్ణ సినిమాలో విల‌న్ పేరు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతూ ఉంది. మ‌రి ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌ను క‌ర్కోట‌క లుక్ లో చూపిస్తూ, అత‌డికి రెడ్డి అని పేరు పెట్ట‌డం అయితే జ‌రిగింది. 

పుష్ప స్టైల్లో రెడ్డిని విల‌న్ గా చూపే ఇంకో ప్ర‌య‌త్న‌మా ఇది, లేక ఇంద్ర‌, స‌మ‌ర‌సింహారెడ్డి లాగా సామాజిక న్యాయం చేస్తారో!