దండం పెడతా….విశాఖ వైపు చూడొద్దు…?

అవును. బతిమాలుకోవడమూ ఇదే. గట్టిగా గద్దించడమని అనుకున్నాసరే. ఇక నచ్చచెప్పడం అనుకున్నా ఏమీ ఫర్వాలేదు. కానీ విశాఖ జిల్లా మంత్రి గారు అవంతి శ్రీనివాసరావు మాత్రం ఓ చంద్రబాబూ నీకు దండం పెడతా మా విశాఖ…

అవును. బతిమాలుకోవడమూ ఇదే. గట్టిగా గద్దించడమని అనుకున్నాసరే. ఇక నచ్చచెప్పడం అనుకున్నా ఏమీ ఫర్వాలేదు. కానీ విశాఖ జిల్లా మంత్రి గారు అవంతి శ్రీనివాసరావు మాత్రం ఓ చంద్రబాబూ నీకు దండం పెడతా మా విశాఖ వైపు చూడొద్దు సారూ అని అంటున్నారు. అవును విశాఖలో ఏ మంచి పని చేయాలనుకున్నా చంద్రబాబు కోర్టుకెళ్ళి అదే పనిగా  అడ్డుకుంటున్నారు అని మంత్రి అవంతి తెగ పరేషాన్ అవుతున్నారు.

విశాఖను రాజధాని చేస్తామంటే కోర్టుకు పోయారు, విశాఖలో భూకంపాలు, సునామీలు వస్తాయని కూడా అనుకూల మీడియాలో రాతలు రాయించి జనాలను  భయపెట్టేశారు. మరి ముంబై, చెన్నై సముద్ర తీరాల వద్ద  లేవా చంద్రబాబూ అంటూ అవంతి నిలదీశారు. అంతే కాదు, అన్నీ అమరావతిలోనే, అదే మన రాజధాని అని బాబు అంటే జగన్ మూడు రాజధానులని అన్ని ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు.

ఇక విశాఖ రాజధాని కావాల్సిందే అని కూడా అవంతి గట్టిగా చెప్పేశారు. మరో వైపు విశాఖలో దాదాపుగా రెండు లక్షల మంది పేదలకు ఆరు వేల ఎకరాల భూమిని ఇళ్ళ పట్టాలుగా చేసి ఇవ్వాలని వైసీపీ సర్కార్ ఆలోచిస్తే దాని మీద కూడా కోర్టుకు వెళ్లారని, చివరికి కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అవంతి అన్నారు.

దీని వల్ల విశాఖ సిటీలో ఉన్న ఒక్కో పేదవానికి ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే డెబ్బై గజాల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని అవంతి చెప్పుకొచ్చారు. అలాగే ఇళ్ళు కూడా కట్టిస్తామని పేర్కొన్నారు. ఇక  తాము విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూంటే పేదలకు న్యాయం చేయాలనుకుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు అని అవంతి మండిపడ్డారు.

ఏపీ అప్పుల కుప్ప అని చెబుతున్న బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్రం తెచ్చే లక్షల అప్పులు కనిపించడం లేదా అని లాజిక్ పాయింటే మంత్రి గారు తీశారు. అప్పులు తేకపోతే ఎక్కడైనా పాలన సాగేనా అని ఆయన ప్రశ్నించారు. మొత్తం మంత్రి గారి మాటలలో కొసమెరుపు ఏదంటే పవన్ కళ్యాణ్ గురించిన కామెంట్స్ మాత్రమే.

పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటూ ఆయన జనసేనాని గాలి తీసేశారు. మొత్తానికి అవంతి బాబుని విశాఖ వైపు చూడొద్దు అంటే ఒక పాత పాట గుర్తుకు వస్తోంది. టౌన్ పక్కకెళ్ళద్దురో డింగరీ అని. మరి బాబు ఈ మాటలు విని విశాఖ ఊసు తలవడం మానేస్తారా. ఏమో మంత్రి గారి అతి మంచితనం కాకపోతేనూ….