ప్రభాస్ సినిమాకు కొత్త టైటిల్

ఎంటర్ టైన్ మెంట్ డైరక్టర్ మారుతి..బాహుబలి ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లానింగ్ లో వుందన్న సంగతి తెలిసిందే. దీనికి రాజా డీలక్స్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారని వార్తలు…

ఎంటర్ టైన్ మెంట్ డైరక్టర్ మారుతి..బాహుబలి ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లానింగ్ లో వుందన్న సంగతి తెలిసిందే. దీనికి రాజా డీలక్స్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారని వార్తలు వచ్చాయి. 

అయితే ఈ టైటిల్ ను ఇప్పుడు జ‌స్ట్ వర్కింగ్ టైటల్ గా మారుస్తున్నారు. వేరే టైటిల్ దొరికే వరకు రాజా డీలక్స్ అనేదే వర్కింగ్ టైటిల్ గా వుంటుంది.

ప్రభాస్ తో చేసే పాన్ ఇండియా సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ అంత యాప్ట్ గా వుండదని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. నిజానికి ఈ టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అందుకే ఇప్పుడు సరైన టైటిల్ కోసం అన్వేషణ ప్రారంభించారు. అన్ని భాషలకు సరిపడే సింగిల్ టైటిల్ ను సెలెక్ట్ చేసిన తరువాత అనౌన్స్ చేస్తారు.

ఈ సినిమా షూట్ త్వరలో ప్రారంభం అవుతుంది. ముగ్గురు హీరోయిన్లు వుండే ఈ సినిమాకు ఇద్దరు కొత్త హీరోయిన్లను తీసుకునే అవకాశం వుంది. థమన్ సంగీతం అందిస్తారు. సినిమాటోగ్రాఫర్ ఎవరన్నది ఈవారం తెలుస్తుంది.