కొసరు రాజధానితో బాబు మభ్య పెట్టే ప్రకటనలు

అమరావతి రాజధానిగా ఎవరూ తీసేయలేదు. దానితో పాటుగా విశాఖ, కర్నూల్ రాజధానులుగా ఉంటాయని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు మాత్రం విశాఖను రాజధానిగా ఒప్పుకోవడంలేదు. కానీ దానిని ఆర్ధిక రాజధాని అంటున్నారు. ఐటీ రాజధాని…

అమరావతి రాజధానిగా ఎవరూ తీసేయలేదు. దానితో పాటుగా విశాఖ, కర్నూల్ రాజధానులుగా ఉంటాయని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు మాత్రం విశాఖను రాజధానిగా ఒప్పుకోవడంలేదు. కానీ దానిని ఆర్ధిక రాజధాని అంటున్నారు. ఐటీ రాజధాని అంటున్నారు

ఇలా ఏదో ట్యాగ్ తగిలించి కొసరు రాజధానితో తానూ విశాఖకు హోదా పెంచేశాను కదా అంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు విశాఖను కల్చరల్ క్యాపిటల్ అన్నారు. టూరిజం క్యాపిటల్ అన్నారు. సినిమా క్యాపిటల్ అన్నారు అవన్నీ ఏమయ్యాయని జనాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

బాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉండగా హైదరాబాద్ లో ఫ్లై ఓవర్స్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అదే టైం లో విశాఖకు ఒక్క ఫ్లై ఒవర్ కి కూడా ఓకే చెప్పలేదు అన్నది ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న అతి పెద్ద ఆరోపణ. విశాఖకు సెజ్ లు వచ్చినా ఫ్లై ఓవర్ కట్టినా ఐటీ హబ్ వచ్చినా అంతా 2004 తరువాత వైఎస్సార్ హయాంలోనే వచ్చిన సంగతిని జనాలు గుర్తు చేస్తున్నారు.

విశాఖను ఆర్ధిక రాజధాని చేస్తామని చెబుతున్న చంద్రబాబు పాలనా రాజధానిగా ఎందుకు ఒప్పుకోరు అన్నదే సగటు జనాల ప్రశ్న. ఒకపుడు ఆంధ్ర రాష్ట్రంగా  ఉన్నపుడు తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు కర్నూల్ రాజధానిగా ఉన్నా విశాఖలో బడ్జెట్ సెషన్ నెల రోజుల పాటు నిర్వహించిన సంగతిని గుర్తు చేస్తున్నారు.

ఏపీలో అతి పెద్ద సిటీగా విశాఖ ఉందని, తెలుసు. అది ఆర్ధికంగా ఏపీని పోషించే సత్తా ఉందనీ తెలుసు. ఇన్ని తెలిసి కూడా విశాఖకు రాజధాని అక్కరలేదని భావించడమే ఫార్టీ ఇయర్స్ చంద్రబాబు రాజకీయంగా చెబుతున్నారు. పైగా తాను కూడా విశాఖను రాజధానిగానే చెబుతున్నాను అంటూ ఆర్ధిక రాజధాని అని ఏదో పేరు పెట్టి జనాలను మభ్యపెడుతున్నారు అన్నదే జనం బాధగా ఉంది.

ఏపీకి రాజధాని అంటూ లేకుండా చేశారు అని తాపీగా జగన్ని పట్టుకుని నిందిస్తున్న చంద్రబాబుకు లక్ష కోట్ల రాజధాని కట్టడం ఏపీ వల్ల తన వల్ల కాదని తెలిసి కూడా అయిదేళ్ల పాటు వేస్ట్ గా కాలం గడిపేసినపుడు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మన రాజధాని అని ప్రభుత్వ భూములలో కేంద్రం ఇచ్చిన రెండు వేల అయిదు వందల కోట్లతో రాజధాని కట్టి చూపిస్తే ఆ తరువాత జగన్ వచ్చినా ఏమీ చేయలేకపోయేవారు కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

తప్పంతా తన మీద వేసుకుని రాజధాని అంటే ప్రపంచంలోనే పెద్దదిగా ఉండాలంటూ నేల విడిచి సాము చేస్తూ పోయిన చంద్రబాబుకు ఇపుడు జగన్ని విమర్శించే పరిస్థితి ఉందా అన్నదే మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న.