అయ్యప్పన్ కు ట్యూన్లు రెడీ

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ వ్యవహారాలు చకచకా జరుగుతున్నాయి. అఫీషియల్ గా ప్రకటించకపోయినా, ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వరకు జరిగిపోతున్నాయి. Advertisement త్రివిక్రమ్ సూపర్ విజన్ లో దర్శకుడు సాగర్ వన్ లైన్ ఆర్డర్,…

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ వ్యవహారాలు చకచకా జరుగుతున్నాయి. అఫీషియల్ గా ప్రకటించకపోయినా, ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వరకు జరిగిపోతున్నాయి.

త్రివిక్రమ్ సూపర్ విజన్ లో దర్శకుడు సాగర్ వన్ లైన్ ఆర్డర్, డైలాగ్ వెర్షన్ రెడీ చేస్తున్నారు. రానాకు స్క్రిప్ట్ ఫైనల్ నేరేషన్ ఇస్తే సెట్ మీదకు వెళ్లిపోవడానిక రంగం సిద్దం అవుతుంది.

ఇదిలా వుంటే ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు థమన్ రెండు ట్యూన్లు ఇప్పటికే రెడీ చేసి, ఓకె చేయించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి అయ్యప్పన్ కోషియమ్ లో సాంగ్స్ కు అవకాశం లేదు.

అయితే పవన్ కళ్యాణ్ సినిమా అడియో అంటే కనీసం ఓ రెండు కోట్లు రైట్ల రూపంలో వస్తుంది. అందుకోసం అయినా ఓ మాడు పాటలు వుంటే బెటర్. సినిమాలో మాంటేజ్ సాంగ్ కు చాన్స్ వుంటుంది. అలాగే టైటిల్స్ సాంగ్ అనో, ప్రమోషన్ సాంగ్ అనో చెప్పి మరో రెండు వాడేయవచ్చు.

అందుకే థమన్ రెండు ట్యూన్లు ఇప్పటికే రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈవారంలో థమన్ చెన్నయ్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఓవారం ఇక్కడే వుండి ట్యూన్లు అన్నీ ఫైనల్ చేయించుకుంటారని తెలుస్తోంది.

మళ్ళీ అదే ప్రశ్న