తెలుగులోకి ‘ఇష్క్’

తెలుగులో వచ్చి పెద్ద హిట్ అయిన సినిమా ఇష్క్. మరి మళ్లీ తెలుగులోకి ఇష్క్ ఏమిటి? అన్న అనుమానం రావడం సహజం. ఇది ఆ ఇష్క్ కాదు. మళయాలంలో ఇష్క్ అనే పేరుతో ఓ…

తెలుగులో వచ్చి పెద్ద హిట్ అయిన సినిమా ఇష్క్. మరి మళ్లీ తెలుగులోకి ఇష్క్ ఏమిటి? అన్న అనుమానం రావడం సహజం. ఇది ఆ ఇష్క్ కాదు. మళయాలంలో ఇష్క్ అనే పేరుతో ఓ సినిమా వచ్చింది.

ఆ సినిమాను ఇప్పుడు తెలుగులో నిర్మిస్తున్నారు. చాన్నాళ్ల తరువాత ఆర్ బి చౌదరి నిర్మాతగా మళ్లీ ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసినా, కొడుకు హీరోగా మారాక ఆయన తగ్గించారు. 

ఆ విషయం అలా వుంచితే బాల హీరో తేజు (ఓ బేబీ)తో మళయాలం ఇష్క్ ను రీమేక్ చేస్తున్నారు. ఓ అబ్బాయిని, అతని గర్ల్ ఫ్రెండ్ ను కొందరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు.

దానికి బదులుగా వాళ్ల ఫ్యామిలీలను హీరో విధంగా కార్నర్ చేసాడు అనే పాయింట్ తో తయారైన సినిమా ఇది. అతి తక్కువ బడ్జెట్ అతి తక్కువ కాస్టింగ్ తో వుండే సినిమా ఇది.

ఈ సినిమా షూట్ ను సైలంట్ గా స్టార్ట్ చేసారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతోంది.

ఓర్నీ ప‌ట్టాభి …ఎంత‌కు దిగ‌జారావ‌య్యా!