టీడీపీ ఎమ్మెల్సీ, గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడు మృతి చెందారు. గుండెపోటుతో నెలరోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి వెంటిరేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో ఆయన ఈ రోజు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2000 నుండి 2005 వరకు మచిలీపట్టణం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఎమ్మెల్యే కోటాలో 2017లో శాసనమండలికి ఎన్నికయ్యారు. 2020లో టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరమవ్వడంతో బచ్చులను టీడీపీ ఇంచార్జ్ గా నియమించారు.
బచ్చుల అర్జునుడు మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అర్జునుడి మృతికి పలువురు టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు.