వికారాబాద్ అడవుల్లో క్రిష్ కు ఏం పని?

డైరక్టర్ క్రిష్ కు ఓ టాలెంట్ వుంది. ఎలాంటి సినిమా అయినా పెర్ ఫెక్ట్ ప్లానింగ్ తో, పక్కాగా అనుకున్న టైమ్ లో ఫినిష్ చేసేయగలరు. గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాను…

డైరక్టర్ క్రిష్ కు ఓ టాలెంట్ వుంది. ఎలాంటి సినిమా అయినా పెర్ ఫెక్ట్ ప్లానింగ్ తో, పక్కాగా అనుకున్న టైమ్ లో ఫినిష్ చేసేయగలరు. గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాను కూడా రీజనబుల్ బడ్జెట్ లో, రీజనబుల్ టైమ్ లో తీసి చూపించారు. సరే, కథనాయకుడు, మహానాయకుడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 

లేటెస్ట్ గా వున్నట్లుండి ఓ సినిమాను ప్రకటించారు. లేటెస్ట్ మెగాహీరో వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఓ సినిమాను ప్రకటించారు. చేతిలో పవన్ కళ్యాణ్ సినిమా వుంచుకుని కూడా, ఇలా ప్రకటించడమే ఓ ఆశ్చర్యం అనుకుంటే, కరోనాకు భయపడకుండా, నలభై రోజుల సింగిల్ షెడ్యూలు ప్లాన్ చేసి, అర్జెంట్ గా వికారాబాద్ అడవులకు పయనమై వెళ్తున్నారు.

ఇంతకీ ఈ అడవుల్లో క్రిష్ ఏం చేయబోతున్నారు? ఈ సినిమా దాదాపుగా మూడు వంతులకు ఫైగా అడవుల బ్యాక్ డ్రాప్ లో వుంటుందట. ఏనుగులు, పులులు, సింహాలు, కొండ చిలువలు ఇలాంటి జంతు జాలం అంతా వుంటుందట. అన్నట్లు పనిలో పని జంతువులతో వైష్ణవ్ తేజ్ ఫైటింగ్ లు కూడా వుంటాయట. పనిలోపని ఎర్రచందనం వ్యవహారాలు కూడా వుంటాయని బోగట్టా.

అంటే బన్నీ-సుకుమార్ ల అడవి, ఎర్రచందనం నేపథ్యపు సినిమా టేస్ట్ ను క్రిష్ ముందుగానే చూపించేస్తున్నారేమో కొంపదీసి? ఇమ్మీడియట్ గా ప్రారంభించి, నలభై రోజుల్లోగా ఫినిష్ చేసి, 2021 సంక్రాంతికి రెడీ చేసేయాలని క్రిష్ సంకల్పంగా తెలుస్తోంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ సినిమా వ్యవహారం ఎలాగూ వుంటుంది. 

ప్రయత్నం మంచిదే.. ప్రయాణమే

ఇదీ జగన్ విజన్