బ్రేకప్ నుంచి కోలుకొని, ఫ్రెష్ గా మరో రిలేషన్ షిప్ స్టార్ట్ చేసిన శృతిహాసన్, తన పెళ్లిపై స్పందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తన పెళ్లి టాపిక్ అంత ముఖ్యం కాదంటోంది. నిజానికి తనకు జీవితంలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదని అంటోంది.
“నిజం చెప్పాలంటే జీవితంలో నేను పెళ్లి చేసుకోను. అయినా ఇప్పుడది ముఖ్యం కాదు. 2021లో చాలా ఇష్యూస్ ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. చాలా బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి. నా పెళ్లి అస్సలు టాపిక్ కానే కాదు.”
ఇలా తన పెళ్లి మేటర్ ను స్కిప్ చేసింది 35 ఏళ్ల శృతిహాసన్. చాలా అంశాలపై బోల్డ్ గా స్పందించే ఈ ముద్దుగుమ్మ.. సెక్స్-ఫుడ్ అనే టాపిక్ పై కూడా రియాక్ట్ అయింది. తన దృష్టిలో సెక్స్ కంటే ఆహారమే ముఖ్యం అంటోంది.
“సెక్స్-ఫుడ్ ను కంపార్ చేయడమే తప్పు. భోజనం లేకుండా ఎవరైనా ఉండగలరా? ఫుడ్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు? సెక్స్ లేకపోతే చచ్చిపోం. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే.. సెక్స్ కంటే ఫుడ్ చాలా ముఖ్యం.”
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది. విజయ్ సేతుపతి సరసన ఆమె నటించిన తమిళ సినిమా లాభం తెలుగులో కూడా రిలీజైంది. కానీ ఇక్కడ అది ఫ్లాప్ అయింది. వీటితో పాటు మరో 2 బాలీవుడ్ సినిమాలు శృతి చేతిలో ఉన్నాయి.