రాజధాని నినాదం వేళ మోడీ విశాఖ టూర్

రాక రాక దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తున్నారు. ఈ ట్రిప్ లో ఆయన చాలా కార్యక్రమాలలో పాలుపంచుకుంటారని భోగట్టా. స్థానికంగా వరసపెట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని తెలుస్తోంది.   Advertisement…

రాక రాక దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తున్నారు. ఈ ట్రిప్ లో ఆయన చాలా కార్యక్రమాలలో పాలుపంచుకుంటారని భోగట్టా. స్థానికంగా వరసపెట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని తెలుస్తోంది.  

విశాఖ రైల్వే జోన్ కోసం భవనాలకు ఇదే ట్రిప్ లో ప్రధాని శంకుస్థాపనలు చేస్తారని బీజేపీ వారు చెబుతున్నారు. భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు అని తెలుస్తోంది.

విజయనగరంలో ఏర్పాటు చేసిన గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా వెల్లడించారు. మోడీ చివరిసారిగా 2019 లో విశాఖకు వచ్చారు. నవంబర్లో మోడీ పర్యటన ఖరారు అయితే దాదాపుగా నాలుగేళ్ళ తరువాత ఆయన వస్తున్నట్లుగా భావించాలి.

మోడీ విశాఖ టూర్ లో రాజకీయ అంశాలు కూడా ప్రస్థావనకు వస్తాయా అన్నది కూడా ఆలోచించాలి. విశాఖ రాజధాని అని ఒక వైపు కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. కేంద్రం అభిప్రాయం ఏంటి, విశాఖ అభివృద్ధి మీద రాజధాని మీద బీజేపీ స్టాండ్ ఏమిటి అన్నది ప్రధాని చూచాయగా అయినా తాను పాల్గొన్న కార్యక్రమాలలో వెల్లడించే అవకాశాలు ఉంటాయా అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.