‘శాసనసభ’లో హెబ్బాపటేల్ సాంగ్

ఒక్క సినిమాతో మంచి పోజిషన్ కు వెళ్లినా తరువాత సరైన హిట్ లు సాధించలేకపోయింది హెబ్బా పటేల్. ఇప్పుడు స్పెషల్ సాంగ్ లు అంటే మాత్రం ఆమె గుర్తుకు వస్తోంది. తరచు ఐటమ్ గీతాల్లో…

ఒక్క సినిమాతో మంచి పోజిషన్ కు వెళ్లినా తరువాత సరైన హిట్ లు సాధించలేకపోయింది హెబ్బా పటేల్. ఇప్పుడు స్పెషల్ సాంగ్ లు అంటే మాత్రం ఆమె గుర్తుకు వస్తోంది. తరచు ఐటమ్ గీతాల్లో అలరిస్తున్న హెబ్బా ఇప్పుడు మరో సారి అలాంటి చాన్స్ ను పట్టుకుంది. 

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం శాసనసభ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు.

ఈ చిత్రంలో హెబ్బాపటేల్ ఓ ప్రత్యేక పాటలో నర్తించింది. ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర బృందం ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ ప్రత్యేకపాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రవిబసుర్ సంగీత ఈ చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. ఆయన సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రత్యేకపాటకు ప్రేమ్ రక్షిత్ నృత్య రీతులు అందించగా, పాపులర్ సింగర్ మంగ్లీ ఆలపించారు. .త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్‌రెడ్డి