డాక్టర్ల సలహా మేరకే పవన్ ఆ పని చేశారు

పవన్ కల్యాణ్ సడెన్ గా గడ్డం ఎందుకు తీసేశారని చాలామందికి అనుమానాలున్నాయి. సినిమాల కోసమని కొందరు, తానా వేడుకలకు వెళ్లడానికని మరికొందరు, అసహ్యంగా ఉందని అందరూ చెబుతుంటే మనసు ఒప్పుకోకపోయినా తీసేశాడని మరికొందరు అనుకుంటున్నారు.…

పవన్ కల్యాణ్ సడెన్ గా గడ్డం ఎందుకు తీసేశారని చాలామందికి అనుమానాలున్నాయి. సినిమాల కోసమని కొందరు, తానా వేడుకలకు వెళ్లడానికని మరికొందరు, అసహ్యంగా ఉందని అందరూ చెబుతుంటే మనసు ఒప్పుకోకపోయినా తీసేశాడని మరికొందరు అనుకుంటున్నారు. కానీ అసలు కారణం మరొకటి ఉంది.

డాక్టర్ల సలహా మేరకే పవన్ గడ్డం తీసేశారట. ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావడంతో పవన్ డాక్టర్ల సలహా పాటించి గడ్డం తీసేయాల్సి వచ్చింది. అయితే చాలారోజుల పాటు ఈ విషయంలో పవన్ తాత్సారం చేసినా చివరకు ఆయన డాక్టర్ల మాట వినాల్సి వచ్చిందట.

గతంలో కంటి దగ్గర పవన్ కు ఎలర్జీ వచ్చినప్పుడు కూడా ఆయన హెయిర్ డైల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు డాక్టర్లు. అందుకే జుట్టు తెల్లబడుతున్నా ఎప్పుడో ఓసారి మాత్రమే పవన్ హెయిర్ డై వాడేవారు. ఇక పెరుగుతున్న గడ్డానికి కూడా పవన్ రంగు వేయాల్సి వచ్చేది. దీంతో గడ్డం కింద చర్మానికి ఎలర్జీ వచ్చిందట.

కొన్నిరోజుల క్రితం స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు అర్జంట్ గా గడ్డం తీసేయాలని డాక్టర్లు సూచించారట. కళ్లకు కూడా అది ఇబ్బందిగా మారుతుందని హెచ్చరించారట. అప్పటికప్పుడు పవన్ ఒప్పుకోకపోయనా, తర్వాత సమస్య మరింత ముదరడంతో ట్రిమ్ చేయించారు, జుట్టు కూడా కత్తిరించారు.

ఇకపై పవన్ గడ్డం పెంచబోరని, చర్మ సమస్య పూర్తిగా తగ్గేవరకు ఆయన ట్రిమ్ చేయిస్తూనే ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా