జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని జార్ఖండ్ గవర్నర్ సిద్దం అయినట్లు కనపడుతోంది
జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరేన్.. మైనింగ్ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపిస్తూ బీజేపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు.. దీనిపై గవర్నర్ రమేష్ బైస్‌కు.. ఈసీ అభిప్రాయం కోరారు.
ఇది ఇలా ఉండగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శాసనసభ్యులను సాయంత్రంలోగా రాంచీకి చేరుకోవాలని పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఢిల్లీలో ఉన్న జార్జండ్ గవర్నర్ రమేష్ బైస్ గురువారం రాంచీకి తిరిగి వెళ్లారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 192 ప్రకారం, ఒక రాష్ట్ర శాసన సభ సభ్యుడు ఏవైనా అనర్హతలకు లోనయ్యారా అనే ప్రశ్న తలెత్తితే, గవర్నర్ తుది నిర్ణయం తీసుకుంటారు.
బీజేపీ నేతలు గతంలో చెప్పినట్లగానే జార్జండ్ ముక్తి మోర్చాను అధికారం నుండి పడగొడతాం అని అనట్లుగానే జరుగుతున్న పరిస్ధితులు బట్టి ఆర్థం అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సృష్టమైన మోజారిటీ రాకపోయిన కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు.