ర‌కుల్‌కు ఇంట్లోనే శ‌త్రువులు

టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్ సింగ్‌కు శ‌త్రువులు మ‌రెక్క‌డో లేరు. ఇంట్లోనే ఆమెకు బ‌ద్ద శ‌త్రువులున్నారు. ఒక‌టి చేస్తే…దానికి ప‌ది జోడించి ప్ర‌చారం చేసే వ్య‌క్తి ర‌కుల్‌కు త‌మ్ముడి రూపంలో ఉన్నాడు. ర‌కుల్‌ప్రీత్ సింగ్,  ఆజానుబాహుడు…

టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్ సింగ్‌కు శ‌త్రువులు మ‌రెక్క‌డో లేరు. ఇంట్లోనే ఆమెకు బ‌ద్ద శ‌త్రువులున్నారు. ఒక‌టి చేస్తే…దానికి ప‌ది జోడించి ప్ర‌చారం చేసే వ్య‌క్తి ర‌కుల్‌కు త‌మ్ముడి రూపంలో ఉన్నాడు. ర‌కుల్‌ప్రీత్ సింగ్,  ఆజానుబాహుడు ద‌గ్గుబాటి రానా డేటింగ్‌లో ఉన్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే అలాందేమీ లేద‌ని, త‌మది స్నేహం మాత్ర‌మేన‌ని,  వాళ్లిద్ద‌రూ తేల్చి చెప్పారు. దీంతో వాళ్ల‌ద్ద‌రి ప్రేమ‌పై ప్ర‌చారానికి ఫుల్‌స్టాప్ ప‌డింది.

అయితే త‌న జీవితంలో ఇంత వ‌ర‌కూ ప్రేమ దోమ లాంటివేవీ లేవ‌ని ర‌కుల్ చెప్పారు. త‌న‌కు ఎలాంటి ల‌వ్ ట్రాక్ లేద‌ని, ఇంకా సింగిల్‌గానే ఉన్నానంటోంది ర‌కుల్. దీనికి కార‌ణం త‌న త‌మ్ముడు అమ‌న్ ప్రీత్ సింగ్ అని ఆవేద‌న‌తో చెబుతోంది ఆమె.  ఓ మీడియాకిచ్చిన ఇంట‌ర్వ్యూలో రకుల్ త‌న తమ్ముడితో క‌లిసి స‌ర‌దా విష‌యాలు వెల్ల‌డించారు.

ర‌కుల్ మాట్లాడుతూ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. త‌న‌ చిన్న‌త‌నంలో స్కూలులో అబ్బాయిల‌తో మాట్లాడే అవ‌కాశ‌మే లేద‌ని చెప్పుకొచ్చింది. దీనంత‌టికి కార‌ణం త‌న త‌మ్ముడేన‌ని ఆమె వెల్ల‌డించారు. అబ్బాయిల‌తో మాట్లాడ‌దామ‌నుకుంటే చాలు వెంట‌నే వెళ్లి ఇంట్లో త‌న‌పై త‌మ్ముడు ఫిర్యాదు చేసేవాడ‌ని ఆమె చెప్పారు.

ఒక‌రోజైతే.. తాను ప్లేటు ప‌ట్టుకుని ఓ అబ్బాయి ప‌క్క‌న ఊరికే నిలిచాన‌ని..  అది చూసిన  త‌మ్ముడు ఇంటికెళ్లి అత‌నికి  నేను తినిపిస్తున్నానని అమ్మానాన్న‌ల‌కు చాడీలు చెప్పాడ‌ని ర‌కుల్ గుర్తు చేసుకున్నారు. త‌మ్ముడి వ‌ల్లే అన్నీ కోల్పోయి.. ఇప్ప‌టికీ సింగిల్‌గా ఉన్నాన‌ని న‌వ్వుతూ చెప్పుకొచ్చారు ర‌కుల్‌.

ర‌కుల్ త‌మ్ముడు అమ‌న్ మాట్లాడుతూ..”అవును.. స్కూలు లైఫ్‌లో అక్క ఏమీ చేయ‌నీయ‌కుండా చేశాను. కానీ అప్పుడు అలా చేసుండాల్సింది కాదేమో అనిపిస్తోందిష‌ అని ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేశాడు. ప‌శ్చాత్తాపానికి మించిన ప్రాయ‌శ్చిత్తం లేదంటారు కాదు. త‌మ్ముడి త‌ప్పుల‌ను మ‌న్నించాల‌ని ర‌కుల్‌కు చెబుదామా…

అందరినీ ఒక అటాడించిన యాంకర్ రవి కూతురు