బాలీవుడ్ లో మరో విడాకులు..!

బాలీవుడ్ కు విడాకులు కొత్త కాదు. ఆశ్చర్యకర రీతిలో విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో స్టార్ కపుల్ చేరింది. హీరో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య అవంతిక విడిపోవడం…

బాలీవుడ్ కు విడాకులు కొత్త కాదు. ఆశ్చర్యకర రీతిలో విడిపోయిన జంటలు కూడా ఉన్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో స్టార్ కపుల్ చేరింది. హీరో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య అవంతిక విడిపోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వీళ్లిద్దరి మధ్య తీవ్రస్థాయిలో అభిప్రాయబేధాలు వచ్చినట్టు తెలుస్తోంది.

గడిచిన నెల రోజులుగా వీళ్ల మధ్య సయోధ్య కుదర్చడానికి పెద్దలు ప్రయత్నించినప్పటికీ వ్యవహారం సద్దుమణగలేదని తెలుస్తోంది. స్వయంగా అమీర్ ఖాన్ రంగంలోకి దిగినప్పటికీ, మేనల్లుడి కాపురాన్ని చక్కదిద్దలేకపోయాడని తెలుస్తోంది. రీసెంట్ గా కుటుంబ సభ్యులందరితో కలిసి అమీర్ దిగిన ఫ్యామిలీ ఫొటోలో కూడా అవంతిక కనిపించలేదు.

వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో కొన్నిరోజుల కిందట తన ఐదేళ్ల కూతుర్ని తీసుకొని అవంతిక పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇమ్రాన్-అవంతిక కలిసి ఉండడంలేదు. వీళ్లిద్దరు విడిపోవడానికి ఇమ్రాన్ ప్రొఫెషనల్ లైఫ్ కారణమని తెలుస్తోంది.

కెరీర్ లో సరిగ్గా రాణించలేకపోయాడు అతడు. హీరో వేషాలు పక్కనపెడితే, కనీసం క్యారెక్టర్ రోల్స్ కూడా రావట్లేదు. దీంతో తాజాగా దర్శకుడిగా కూడా మారాడు. ఈ ఒత్తిడి మొత్తాన్ని భార్యపై చూపించడంతో కుటుంబ జీవితంలో కలతలు వచ్చినట్టు తెలుస్తోంది.

ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్, అవంతిక ప్రేమ వ్యవహారాన్ని బాలీవుడ్ లో గొప్పగా చెప్పుకునేవారు. ఏకంగా 8 ఏళ్లు ప్రేమించుకున్నారు వీళ్లు. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. 2014లో వీళ్లకు పాప కూడా పుట్టింది. అంతా సజావుగా సాగిపోతుందనుకునే టైమ్ లో ఇలా గొడవలు మొదలయ్యాయి.

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం