డొమస్టిక్ మార్కెట్ పై ఓవర్ సీస్ ఆశ

అన్ని సినిమాలు ఒకేలా వుండవు. కొన్ని ఓవర్ సీస్ లో ఆడితే, డొమస్టిక్ మార్కెట్ లో ఆడవు. కొన్ని రెండుచోట్లా కుమ్మేస్తాయి. కొన్ని రెండుచోట్లా బకెట్ తన్నేస్తాయి. అయితే ఈ మార్కెట్ వల్ల ఆ…

అన్ని సినిమాలు ఒకేలా వుండవు. కొన్ని ఓవర్ సీస్ లో ఆడితే, డొమస్టిక్ మార్కెట్ లో ఆడవు. కొన్ని రెండుచోట్లా కుమ్మేస్తాయి. కొన్ని రెండుచోట్లా బకెట్ తన్నేస్తాయి. అయితే ఈ మార్కెట్ వల్ల ఆ మార్కెట్ ప్రభావితం కావడం కానీ, ఆ మార్కెట్ వల్ల ఈ మార్కెట్ ప్రభావితం కావడం కానీ చాలా రేర్ గా జరుగుతుంటుంది.

మహర్షి సినిమా విషయంలో ఇప్పుడు ఆ ఫీట్ జరుగుతుందా అన్న టాక్ వినిపిస్తోంది. మహర్షి సినిమాకు క్రిటిక్స్ నుంచి సరైన అప్లాజ్ రాలేదు. అయితే సీజన్ కావడం, ఎండలు మండిపోతుంటడం, మార్కెట్ లో చాలారోజుల బట్టి భారీ సినిమా లేకపోవడం వంటి కారణాలు కావచ్చు, లేదా సినిమా జనాలకు నచ్చి వుండొచ్చు. మొత్తంమీద మహర్షి సినిమా ఫస్ట్ వీకెండ్ డొమస్టిక్ మార్కెట్ లో మంచి వసూళ్లు సాధించింది.

తొలివీకెండ్ 45 నుంచి 50కోట్ల మధ్య డొమస్టిక్ మార్కెట్ లో వసూళ్లు నమోదయ్యే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఓవర్ సీస్ లో మాత్రం స్లో అండ్ స్టడీ అన్నథోరణి కనిపిస్తో్ంది. ప్రీమియర్లు, ఫస్ట్ డే చూసిన తరువాత ఓవర్ సీస్ బార్కెట్ లో వన్ అండ్ హాఫ్ మిలియన్ చేస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే రాను రాను ట్రెండ్ చూస్తుంటే కాస్త బాగానే వున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికి వన్ మిలియన్ మార్క్ ను చేరుకుంది.

డొమస్టిక్ మార్కెట్ లో మంచి ఫలితాలు నమోదు చేయడం, ఈ వార్తలు వివిధ మాధ్యమాల ద్వారా వ్యాప్తి కావడంతో ఓవర్ సీస్ మార్కెట్ కూడా ఫ్రభావితం అవుతున్నట్లు కనిపిస్తోంది. యుఎస్ లో ఎనిమిది కోట్లకు పైగా మినిమమ్ గ్యారంటీ మీద విడుదల చేసారు. కనీసం రెండు నుంచి రెండున్నర మిలియన్లు చేయాల్సివుంది. డొమస్టిక్ మార్కెట్ ఇచ్చిన ఊపుతో ఓవర్ సీస్ లో టార్గెట్ రీచ్ అవుతామని బయ్యర్లు భావిస్తున్నారు.

డొమస్టిక్ మార్కెట్ మీద వస్తున్న వార్తలు ఓవర్ సీస్ ఆడియన్స్ ను ప్రభావితం చేస్తాయని వారి భావనగా తెలుస్తోంది. మరి అదే ఓవర్ సీస్ ఆడియన్స్ ను సమీక్షలు, యూట్యూబ్ విడియోలు ఎక్కువ ప్రభావితం చేస్తాయా? లేదా ఈ డొమస్టిక్ మార్కెట్ న్యూస్ ప్రభావితం చేస్తుందా అన్నది వేచిచూడాలి.

అమరావతి ఇంట్లో జగన్ ఎందుకు ఉండటం లేదంటే! 

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!