ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లా?

ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ‌స్థ‌లంపై వివాదం చేయ‌డాన్ని టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌ప్పు ప‌ట్టారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ‌స్థ‌లం అంజ‌నాద్రే అని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అన్ని విధాలా ప‌రిశోధించి ఈ ప్ర‌క‌ట‌న…

ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ‌స్థ‌లంపై వివాదం చేయ‌డాన్ని టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌ప్పు ప‌ట్టారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ‌స్థ‌లం అంజ‌నాద్రే అని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అన్ని విధాలా ప‌రిశోధించి ఈ ప్ర‌క‌ట‌న చేసింద‌ని మ‌రోసారి ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో కర్ణాటకలోని హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు గోవిందానంద స్వామి పొంత‌న లేకుండా ఏదేదో మాట్లాడుతున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

గోవిందానంద స్వామి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. అంజ‌నాద్రే ఆంజనేయుడి జ‌న్మ‌స్థ‌లంగా టీటీడీ ప్ర‌క‌టించ‌డంపై  హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి స్వామిఅభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ టీటీడీకి ఓ లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే.

అనంత‌రం సంస్కృత విశ్వ‌విద్యాల‌యంలో ఆంజనేయుడి జన్మస్థలంపై చర్చ కూడా జ‌రిగింది. ఈ అంశాల‌ను జ‌వ‌హ‌ర్‌రెడ్డి గుర్తు చేస్తూ… పురాణాలను కూడా ఆయన విశ్వసించడం లేదన్నారు. 

సరైన ఆధారాలుంటే ఎవరైనా తీసుకు రావొచ్చని మ‌రోసారి జ‌వ‌హ‌ర్‌రెడ్డి తేల్చి చెప్పారు. అంతేకాని విమర్శల కోస‌మే విమ‌ర్శ‌లు చేయడం పనిగా పెట్టుకోవద్దని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి హితవు చెప్పారు.