రెండు ఎపిసోడ్ లు, ఒకటే ట్రయిలర్, ఒకటే అడియో ఒకటే ఫంక్షన్, అనే స్కీమ్ తో ముందుకు వెళ్లింది ఎన్టీఆర్ బయోపిక్ టీమ్. అసలు టైటిల్ కూడా మొదట్లో ఒక్కటే ఎన్టీఆర్. అయితే సినిమాను రెండు భాగాలు చేయడంతో ఎన్టీఆర్ కథనాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని సెపరేట్ చేసారు. కానీ ఒకటే అడియో విడదుల, ఒకటే అడియో ఫంక్షన్, ఒకటే ట్రయిలర్ అని హడావుడి చేసారు. అంతేకాదు ఒకేనెలలో విడుదల అని కూడా అన్నారు. తరువాత అది సమస్య అవుతుందని మూడు వారాలు గ్యాప్ ఇచ్చారు.
అయితే పార్ట్ వన్ ఫలితం వికటించడంతో మొత్తం వ్యవహారం అంతా మారిపోయింది. ఫస్ట్ పార్ట్ లో లేని ఎమోషనల్ కంటెంట్ ను రెండోపార్ట్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం కాస్త అదనపు షూట్ తప్పలేదు. ఇప్పటికిప్పుడు రెండోపార్ట్ విడుదల చేస్తే, తొలిభాగం ప్రభావం దాని మీద కచ్చితంగా పడుతుందని యూనిట్ భావిస్తోంది. అందుకే వీలయినంత గ్యాప్ పెంచాలని చూస్తున్నారు.
తప్పకపోతే 14 లేదా 15న, అవకాశం వుంటే 24న బయోపిక్ ను విడుదల చేయాలని చూస్తున్నారు. అంతేకాదు రెండోభాగం కంటెంట్ లోంచి జనానికి నచ్చుతాయనుకునే సీన్లు కట్ చేసి, మరో ట్రయిలర్ వదిలే ప్రయత్నాల్లో వున్నారు డైరక్టర్ క్రిష్ అని తెలుస్తోంది. ఫస్ట్ వీక్ లో ట్రయిలర్ వదలడం, రెండోభాగంపై డిఫరెంట్ పబ్లిసిటీ మెటీరియల్ వదలడం ప్రారంభిస్తారని తెలుస్తోంది.
కేవలం లుక్ లు వదలడం మాత్రమే తొలి భాగానికి చేసారు. దానివల్ల ఫలితం లేకపోయిందని తేలిపోయింది. అందుకే రెండోభాగంలో ఎమోషనల్ కంటెంట్ ను కొంచెం కొంచెం రివీల్ చేస్తారని టాక్. అందులో భాగంగా మరో ట్రయిలర్ కట్ చేస్తున్నారని తెలుస్తోంది.