థియేటర్లపై అధికారిక జులుం?

సంక్రాంతి సినిమాల వేడి తగలడం మొదలైంది. ఒకేసారి నాలుగు సినిమాలు వస్తుండడంతో థియేటర్ల రగడ ఎక్కువైంది. ఇప్పటికే టాలీవుడ్ లో దీనిపై హడావుడి జరుగుతుంటే, గ్రౌండ్ లెవెల్ లో సీన్ మరోలా వుంది. టాలీవుడ్…

సంక్రాంతి సినిమాల వేడి తగలడం మొదలైంది. ఒకేసారి నాలుగు సినిమాలు వస్తుండడంతో థియేటర్ల రగడ ఎక్కువైంది. ఇప్పటికే టాలీవుడ్ లో దీనిపై హడావుడి జరుగుతుంటే, గ్రౌండ్ లెవెల్ లో సీన్ మరోలా వుంది. టాలీవుడ్ లో ఓ పక్క దిల్ రాజు, అరవింద్, యువి వాళ్లు థియేటర్లు వేరేవాళ్లకు అందనివ్వలేదని విమర్శలు మొదలయ్యాయి. కానీ టోటల్ గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 1400 పైచిలుకు స్క్రీన్లలో ఆ ముగ్గురికి గట్టిగా వంద థియేటర్లు కూడా లేవని, అటువైపు వెర్షన్ వినిపిస్తోంది.

ఇదిలావుంటే వినయ విధేయరామ, ఎఫ్ 2 నిర్మాతలు, బయ్యర్లు ముందుచూపుతో థియేటర్ల అగ్రిమెంట్లు ఎప్పుడో చేసుకున్నారు. ఇప్పుడు అది సమస్యగా మారింది. కొన్నిచోట్ల బయోపిక్ కు థియేటర్లు దొరకడం లేదని తెలుస్తోంది. అక్కడ మొదలైంది అసలు తకరారు.

బాలయ్య సినిమాకు థియేటర్ లేదని ఫ్యాన్స్ గొడవ పెడుతున్నారు. మెగా హీరోల సినిమాల థియేటర్లు బలవంతంగా లాక్కుంటున్నారని, మెగాఫ్యాన్స్ గోడవ పెడుతున్నారు. అవనిగడ్డ, పామర్రు ఏరియాల్లో ఎమ్మెల్యేలు బెదిరించి మరీ థియేటర్లు లాక్కున్నారని మెగా ఫ్యాన్స్ గోలపెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ థియేటర్లు ఎఫ్ 2  అగ్రిమెంట్ అయి వున్నాయట.

కానీ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు అడగడంతో ఇచ్చేయక తప్పలేదని తెలుస్తోంది. వెస్ట్ గోదావరిలో వినయ విధేయరామ పడాల్సిన ఏడు థియేటర్లను బలవంతంగా తీసేసుకున్నారని, దానిపై గొడవ జరుగుతోందని తెలుస్తోంది. కృష్ణాజిల్లాలో ఏమీ చేయలేమని, వెస్ట్ గోదావరిలో మాత్రం ఫైట్ చేయడానికి రెడీ అని మెగా ఫ్యాన్స్ కు మెగా డిస్ట్రిబ్యూటర్లు భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కలెక్టర్ల లెవెల్లో, ఎమ్మెల్యేల స్థాయిలో వత్తిడి వస్తుండడంతో థియేటర్ల ఓనర్లు ఏమీచేయలేక చేతులు ఎత్తేస్తున్నారని మెగా క్యాంప్ సమాచారం. ఇదే విషయాన్ని బయోపిక్ క్యాంప్ మాత్రం ఖండిస్తోంది. అలాంటిదేమీ లేదు అంటోంది. కానీ మెగా ఫ్యాన్స్ వర్గాలు మాత్రం అధికారులు, ఎమ్మెల్యేలు వత్తిడిచేసి థియేటర్లు లాక్కుంటున్నారని అంటున్నాయి. మొత్తంమీద పండగవేళ థియేటర్ల కోసం గడబిడ తప్పలేదు.

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

అటు జనం.. ఇటు భయం, పవన్ ఒంటరిగా వెళ్లాలి.. ఇదే అభిమానుల కోరిక!