నాని-చంటబ్బాయ్

క్రికెటర్ అవతారంలో జెర్సీ సినిమా చేస్తున్నాడు హీరో నాని. ఈ సినిమా టాకీ పూర్తయిపోయింది. మార్చిలో విడుదలకు రెడీ అయిపోతోంది. ఇదిలా వుంటే విక్రమ్ కే కుమార్ డైరక్షన్ లో సినిమా ఓకె చేసిన…

క్రికెటర్ అవతారంలో జెర్సీ సినిమా చేస్తున్నాడు హీరో నాని. ఈ సినిమా టాకీ పూర్తయిపోయింది. మార్చిలో విడుదలకు రెడీ అయిపోతోంది. ఇదిలా వుంటే విక్రమ్ కే కుమార్ డైరక్షన్ లో సినిమా ఓకె చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో వుంటుందని తెలుస్తోంది.

సినిమా సినిమాకు డిఫరెంట్ జోనర్ ఎంచుకుంటాడు హీరో నాని. డైరక్టర్ విక్రమ్ కుమార్ ది కూడా ఇదే స్టయిల్. అందుకే ఇప్పుడు ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన చంటబ్బాయ్ మాదిరిగా వుంటుందని తెలుస్తోంది.

విక్రమ్ కుమార్ కథనాన్ని ఆసక్తికరంగా తయారుచేసారు. పైగా ఆయన సినిమాల్లో కామెడీ టచ్ కూడా బాగానే వుంటుంది. ఇప్పుడు రెండు కలిపి నానితో చేయబోయే చంటబ్బాయ్ లాంటి థ్రిల్లర్ సినిమాలో కనిపిస్తాయట.

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

అటు జనం.. ఇటు భయం, పవన్ ఒంటరిగా వెళ్లాలి.. ఇదే అభిమానుల కోరిక!