డిఫరెంట్ క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాధ్ తరువాత సినిమా ఫిక్స్ అయింది. హైపర్ యాక్టివ్ హీరో రామ్ హీరోగా ఓ సినిమాను పూరి జనవరిలో ప్రారంభించబోతున్నారు. ఈ విషయం గత కొంతకాలంగా వార్తల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఫక్కాగా ఫిక్స్ అయింది. ఓ వైవిధ్యమైన కథను పూరి జగన్నాధ్ సిద్దంచేసారు. అనేక సిటింగ్ ల తరువాత అది క్యారరూపంలోకి వచ్చింది.
రామ్ హీరోగా నిర్మించే ఈ సినిమా పూరి స్వంత బ్యానర్ లోనే తయారవుతుంది. జనవరి రెండోవారం తరువాత సెట్ మీదకు వెళ్లే ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త హీరోయిన్ ను తీసుకునే అవకాశం వుంది. అలాగే మిగిలిన స్టార్ కాస్ట్, టెక్నికల్ టీమ్ త్వరలో నిర్ణయమవుతుంది.
కొడుకుతో సినిమా తరువాత పూరి మళ్లీ సినిమా చేయడం ఇదే. ఈ సినిమా తరువాత మరో సినిమా కొడుకు ఆకాశ్ తో వుంటుందని తెలుస్తోంది.