గోపీచంద్ మళ్లీ ట్రాక్ మీదకు వస్తున్నాడు. వరుస డిస్సపాయింట్ల తరువాత కాస్త గ్యాప్ ఇచ్చి, ఆచితూచి సినిమాలు ఓకె చేస్తున్నారు. కథలు, జోనర్ కీలకంగా చూస్తున్నాడు. గ్యాప్ తరువాత ఓకె చేసిన సినిమాకు ఈ రోజు పూజ జరిగింది. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించే స్పయ్ థ్రిల్లర్ లో గోపీచంద్ నటిస్తున్నాడు.
ఈ సినిమాను తమిళ దర్శకుడు తిరు రూపొందిస్తారు. ఈరోజు లాంఛనంగా పూజ జరిపారు. స్టార్ కాస్ట్, టెక్నికల్ టీమ్ ను ఫైనల్ చేసి, జనవరి నుంచి సెట్ మీదకు వెళ్తారు. పూర్తిగా కొత్తగా వుండే ఈ స్పయ్ థిల్లర్ లో గోపీచంద్ కూడా కాస్త కొత్తగా కనిపించబోతున్నాడు.
రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా, పక్కగా జోనర్ ను పట్టుకుని, వెళ్లే కథనంతో ఈ సినిమా వుంటుందని, ఎక్కడా డీవియేషన్, అదర్ దాన్ జోనర్ వ్యవహారాలు వుండవని యూనిట్ వర్గాల బోగట్టా.
పడి పడి లేచె మనసు… పడి… మళ్లీ లేవలేదు! ఎందుకో తెలుసా?
భేకార్ మాటల్.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని డ్యాన్స్ ఏస్తామా