స్టార్ హీరోయిన్ ని ఎవరూ డేట్ కు పిలవడం లేదట!

తనను గత పది సంవత్సరాల్లో ఎవ్వరూ డేట్ కు పిలవలేదు అని చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్. జీరో సినిమా ప్రమోషన్ లో భాగంగా కత్రినా ఈ వ్యాఖ్యలు  చేసింది. కత్రినా అలా చెప్పడం తో…

తనను గత పది సంవత్సరాల్లో ఎవ్వరూ డేట్ కు పిలవలేదు అని చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్. జీరో సినిమా ప్రమోషన్ లో భాగంగా కత్రినా ఈ వ్యాఖ్యలు  చేసింది. కత్రినా అలా చెప్పడం తో కరిగిపోయిన జీరో హీరో షారూక్ ఖాన్ ఆమెను తను డేట్ కు తీసుకెళ్తానని చెప్పాడు. తామిద్దరం డిన్నర్ డేట్ కు వెళ్తామని ప్రకటించాడు. షారూక్ సరదాగా అలా అన్నాడు.

షారూక్ ఓకే కానీ.. పదేళ్ల నుంచి తనను ఎవరూ డేట్ కు పిలవలేదు అని కత్రినా చెప్పుకోవడమే కామెడీ. ఈమె డేటింగుల కథ మీడియాలో బాగా ప్రచారానికి నోచుకుంది. కెరీర్ ఆరంభంలో సల్మాన్ ఖాన్ కు ప్రియురాలిగా పేరు పొందింది కత్రినా. ఐశ్వర్య వియోగంలో ఉండిన సల్మాన్ ను కత్రినా ప్రేమించింది. అతడు జైల్లో ఉన్నప్పుడు వెళ్లి కలిసి వచ్చింది. అలా వీళ్ల బంధం బహిర్గతం అయ్యింది.

ఇక ఆ మధ్య రణ్ బీర్ కపూర్ తో కూడా కత్రినా వ్యవహారం చాలా ప్రచారానికి నోచుకుంది. రణ్ బీర్ తో ఈమె ఒక లవ్ నెస్టో మకాం పెట్టిందని కూడా వార్తలు వచ్చాయి. అలాగే ఒక విదేశీ బీచ్ లో కత్రినా, రణ్ బీర్ లు కలిసి కనిపించడం అప్పట్లో చర్చనీయాంశంగా నిలిచింది. 

రణ్ బీర్ తో బ్రేకప్ అయ్యాకా.. ముఖేష్ అంబానీ కొడుకుతో కత్రినా సన్నిహితంగా కనిపించింది. ఇంత ట్రాక్ రికార్డును పెట్టుకున్న కత్రినా కైఫ్.. పదేళ్ల నుంచి తనను ఏ మగాడూ డేట్ కు పిలవలేదు అని చెప్పుకోవడం మామూలు కామెడీ కాదేమో!

అన్ని దోశలు ఎలా వేశావ్ భయ్యా.. ఆకలేసి ఫన్నీ వీడియో 

కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్