రాజకీయ పబ్బం కోసమేనా…?

సబ్బం హరి. ఆయన కేవలం రెండు సార్లు మాత్రేమే ఎన్నికల్లో గెలిచారు. ఒకసారి విశాఖ నుంచి మేయర్ గా, మరోసారి అనకాపల్లి నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. మరో రెండు సార్లు…

సబ్బం హరి. ఆయన కేవలం రెండు సార్లు మాత్రేమే ఎన్నికల్లో గెలిచారు. ఒకసారి విశాఖ నుంచి మేయర్ గా, మరోసారి అనకాపల్లి నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ దక్కినా ఓడిపోయారు. ఇదీ మొత్తం ఆయన పొలిటికల్ కెరీర్.

ఇక విశాఖలో ఏనాడో అంటే మూడు దశాబ్దాల క్రితమే నాన్ లోకల్ లీడర్లతో నిండిపోయింది. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా నాన్ లోకల్స్ నే తెచ్చి ఎంపీలను చేశాయి. టీడీపీ అయితే పూర్తిగా నాన్ లోకల్స్ పార్టీగానే ఉంది. 

మరి ఆ పార్టీలో ఉంటూ సబ్బం హరి నాన్ లోకల్స్ ని ఎన్నుకోవద్దు అని పిలుపు ఇవ్వడం అంటే హరి డొల్లతనమే తప్ప వేరొకటి కాదు అని వైసీపీ నేతలు అంటున్నారు. అంటే టీడీపీ నాన్ లోకల్స్ అయితే ఇష్టమే, 

అందుకే వారిని హరి క్షమించేశారా అన్న మాట కూడా ఉంది. మొత్తానికి అపర మేధావిగా తనను తాను చెప్పుకుంటున్న హరి మీద మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే స్ట్రాంగ్ డోస్ ఇచ్చేశారు. 

లోకల్ అంటూ గొంతు చించుకుంటున్న హరి ముందు టీడీపీకి రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. విశాఖ రాజధానిని చంద్రబాబు అడ్డుకుంటే అదే పార్టీలో ఉంటూ ఉన్న ఊరుకి ద్రోహం చేస్తున్న హరికి నిజంగా విశాఖ మీద ప్రేమ ఉందా అంటూ గట్టిగానే మంత్రి కౌంటర్ ఇచ్చారు.

ప్రభాస్ కు పెద్ద ఫ్యాన్

రాజకీయాల్లో కేసీఆర్ అంత మేధావి లేడు