రంగస్థలంలో పవన్ కళ్యాణ్

సినిమాలో కనిపించడం కాదు గానీ, రంగస్థలం ప్రదర్శిస్తున్న థియేటర్ లో పవన్ కళ్యాణ్ సందడి చేయబోతున్నాడు. రామ్ చరణ్ గొప్ప ప్రతిభ ప్రదర్శించిన చిత్రంగా పేరు తెచ్చిపెడుతున్న రంగస్థలం చిత్రాన్ని సోమవారం సాయంత్రం ప్రసాద్…

సినిమాలో కనిపించడం కాదు గానీ, రంగస్థలం ప్రదర్శిస్తున్న థియేటర్ లో పవన్ కళ్యాణ్ సందడి చేయబోతున్నాడు. రామ్ చరణ్ గొప్ప ప్రతిభ ప్రదర్శించిన చిత్రంగా పేరు తెచ్చిపెడుతున్న రంగస్థలం చిత్రాన్ని సోమవారం సాయంత్రం ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ లో పవన్ కళ్యాణ్ చూడబోతున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ తో పాటు.. రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ చిత్ర యూనిట్ కూడా సినిమా చూస్తారని తెలుస్తోంది.

రామ్ చరణ్ నట జీవితంలో అన్ని రికార్డులను బద్దలు కొడుతూ రంగస్థలం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాబాయ్ కు కూడా చూపించాలని చెర్రీ ముచ్చట పడ్డాడుట.

బాబాయ్ కోసం స్పెషల్ షో వేయడానికి సిద్ధమైనప్పటికీ… పవన్ మాత్రం సున్నితంగా తిరస్కరించి, ప్రేక్షకులతో కలిసి రెగులర్ థియేటర్ లోనే సినిమాచూస్తానని చెప్పారట.

ఆమేరకు సోమవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ ఫీలింగ్ ఇచ్చేలా ప్రసాద్స్ లో సినిమా చూడబోతున్నారన్నమాట.