స్నేహితుడు పవన్ చొరవతో నిర్మాతగా మారారు శరత్ మురార్. నిజానికి ఆయన ఫ్యామిలీ బ్రాక్ గ్రవుడ్ సినిమా కాదు. ఆయన నేపథ్యం సినిమా అంతకన్నా కాదు. కానీ ఇప్పుడు అక్కడే ఫిక్సయ్యారు.
పవన్ తో మరి సినిమా అన్నది ఇప్పట్లో లేనట్లే. మరేం చేయాలి. కాటమరాయుడు టైమ్ నుంచీ కూడా చిన్న, మీడియం సినిమా ప్రాజెక్టుల కోసం ట్రయ్ చేస్తున్నారు.
చిన్న, మీడియం హీరోలతో, మీడియం బడ్జెట్ లో సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా సెట్ కావడం లేదు. తీసే నిర్మాత ఖాళీగా వుండలేరు కదా? అందుకే డబ్బింగ్ వైపు మళ్లినట్లు తెలుస్తోంది.
హీరో విజయ్ డైరక్టర్ అట్లీ కాంబినేషన్ లో తయారైన మెర్సాల్ సినిమాను శరత్ మురార్ తెలుగులో అందించబోతున్నారు. ఈ మేరకు శరత్ మరార్ ఓ ట్వీట్ చేసారు.
సమంత, నిత్యా మీనన్, కాజల్ లాంటి టాలీవుడ్ కు సుపరిచితమైన టాప్ హీరోయిన్ లు ఈ సినిమాలో వుండడం, విజయ్ కు మరీ అంత క్రేజ్ లేకపోయినా, మన దగ్గర కూడా జనాలకు బాగానే పరిచయం వుండడం వంటివి ఈ సినిమాను క్రేజీ ప్రాజెక్టుగా మార్చేసాయి. సో శరత్ మురార్ ఇక విత్ అవుట్ పవన్ కూడా సినిమాల్లో బిజీ కానున్నారన్నమాట.