అల్లు అర్జున్ నటిస్తున్న డీజే టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే లైక్స్ తో పాటు ఈ టీజర్ కు డిస్-లైక్స్ కూడా రికార్డు స్థాయిలో వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ టీజర్ కు దాదాపు లక్షా 27వేలు లైకులు వస్తే… డిస్-లైక్ చేసే వారి సంఖ్య కూడా లక్షా 10వేల పైనే ఉంది. ఓ తెలుగు సినిమాకు ఇన్ని డిస్-లైకులు రావడం కూడా ఓ రికార్డే. ఊహించని విధంగా టీజర్ కు డిస్-లైకులు పెరుగుతున్న నేపథ్యంలో ఓ సరికొత్త కథనం తెరపైకి వచ్చింది.
దువ్వాడ జగన్నధమ్ టీజర్ అస్సలు బన్నీకి నచ్చలేదట. హరీష్ శంకర్ ఈ టీజర్ కోసం సెలక్ట్ చేసుకున్న షాట్స్, టీజర్ ఎడిట్ చేసిన విధానం అల్లు అర్జున్ కు నచ్చలేదట. అసలు టీజర్ కాన్సెప్ట్ నే బన్నీ రిజెక్ట్ చేశాడట. పైగా ఎండింగ్ లో డైలాగ్ చెబుతున్నట్టు ఓ షాట్ చూపించి, ఆడియో లేకుండా చేయడం కూడా అల్లు అర్జున్ కు రుచించలేదట. బన్నీ తన డిస్-లైక్ ను ఓపెన్ గా వ్యక్తం చేసినప్పటికీ… దర్శకుడు-నిర్మాత కలిసి హడావుడిగా టీజర్ ను రిలీజ్ చేశారని, అందుకే డీజే టీజర్ కు ఇన్ని డిస్-లైక్ లు వస్తున్నాయని ఓ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు.
డిస్ లైక్స్ పెరగడం వల్ల ఈ వాదన తెరపైకి తీసుకొచ్చారా.. లేక నిజంగానే తెరవెనక ఈ సీన్ జరిగిందా అనే విషయంపై ప్రస్తుతం హాట్ హాట్ చర్చ నడుస్తోంది. మరోవైపు దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం టీజర్ సంగతి పక్కనపెట్టి… ట్రయిలర్ పై ఫోకస్ పెట్టాడు. మే 19న డీజే సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.